US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్..
- ఐక్యరాజ్యసమితి సమావేశాల తర్వాత ఇద్దరు దౌత్యవేత్తల బహిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు ఇరాన్ దౌత్యవేత్తల్ని ఆ దేశం బహిష్కరించింది. సర్వసభ్య సమావేశాలు ముగిసిన తర్వాత అమెరికా విడిచి వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ వారిని ఆదేశించింది. ఈ ఆదేశాలను ధిక్కరించిన కారణంగా ఇద్దరు దౌత్యవేత్తల్న ట్రంప్ సర్కార్ బహిష్కరించింది. ఒక దౌత్యవేత్త శుక్రవారం అమెరికా విడి వెళ్లగా, మరొకరు శనివారం యూఎస్ నుంచి బయటకు వెళ్లినట్లు అమెరికా అధికారి తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని సదరు అధికారి వెల్లడించారు.
అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు నిలిచిపోయిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. UNGA సమావేశాల సందర్భంగా ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు జరిగినప్పటికీ పురోగతి కనిపించలేదు. ఆ తర్వాతే ఇరాన్ ప్రతినిధి బృందాన్ని అమెరికా విడిచి వెళ్లాలని రూబియో ఆదేశించినట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి.
Also Read
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ఇదిలా ఉంటే, అమెరికా చర్యల్ని ఇరాన్ ఖండించింది. తమ దౌత్యవేత్తలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే న్యూయార్క్ నుంచి బయలుదేరినట్లు చెప్పింది. ఆ షెడ్యూల్‌ను సెప్టెంబర్ 17నే అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్కు తెలియజేశామని తెలిపింది. అమెరికా చెబుతున్న బహిష్కరణ కథనాలను ఇరాన్ ఖండించింది.
తాజావార్తలు
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!