Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli’s Varanasi Shooting Days: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటేనే సుదీర్ఘకాలం పాటు షూటింగ్ జరుగుతుందనే అభిప్రాయం చిత్ర పరిశ్రమలో ఉంది. సాధారణంగా ఇతర దర్శకులు కొన్ని నెలల్లో సినిమా పూర్తి చేస్తే.. రాజమౌళి మాత్రం తన సినిమాల కోసం ఏళ్ల తరబడి సమయం తీసుకుంటారు. ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు ఇందుకు పెద్ద నిదర్శనం. అయితే ఈసారి మాత్రం జక్కన్న తన ట్రేడ్ మార్క్‌కు భిన్నంగా ‘వారణాసి’ ప్రాజెక్ట్‌ను ఊహించని వేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు.
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయినట్లు జక్కన్న స్వయంగా వెల్లడించారు. సెప్టెంబర్ 28న నిర్వహించిన ఓ ప్రత్యేక క్యూ అండ్ ఏ సెషన్లో వారణాసికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. అన్నింటికంటే షూటింగ్ స్పీడ్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజమౌళి గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొత్తం 1011 రోజుల పాటు కొనసాగింది. 2018 నవంబర్ 19న ప్రారంభమైన షూటింగ్.. 2021 ఆగస్టు 26న పూర్తయింది. అయితే వారణాసి మేజర్ షూటింగ్ మాత్రం 606 రోజుల్లోనే పూర్తయియింది. 2025 జనవరి 24న ప్రారంభమైన షూటింగ్.. 2026 సెప్టెంబర్ 22 నాటికి పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ వ్యవధి పరంగా వారణాసి కొత్త రికార్డు నెలకొల్పినట్లే.
Also Read
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
అత్యంత భారీ స్థాయిలో, అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న వారణాసి సినిమాను ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం ఇప్పుడు ఫాన్స్, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అంతర్జాతీయ స్థాయి విజువల్స్, విస్తృతమైన సెట్స్‌తో తెరకెక్కుతున్నప్పటికీ.. రాజమౌళి షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడంపై అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ఇక మిగిలిన షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, ఇతర నిర్మాణ పనులను కూడా వేగంగా పూర్తి చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఇప్పటికే మహేష్ బాబు లుక్, రాజమౌళి టేకింగ్, భారీ నిర్మాణ విలువలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. వారణాసిలో మహేష్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!