Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- డిగ్రీ ఉంటే చాలు
- సుప్రీంకోర్టులో ఉద్యోగం పొందే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court JCA Recruitment 2026: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (JCA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 అక్టోబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 28, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తి చేయాలి. నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా అభ్యర్థికి కంప్యూటర్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండటంతో పాటు నిమిషానికి కనీసం 35 పదాల కంప్యూటర్ టైపింగ్ వేగం ఉండాలి.
Also Read
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
వయోపరిమితి
2026 సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు:
కనీసం: 18 సంవత్సరాలు
గరిష్ఠం: 30 సంవత్సరాలు
రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహించనున్నారు. మొదట ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించడానికి అభ్యర్థులు కనీసం 50 మార్కులు సాధించాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేస్తారు. అనంతరం కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ అన్ని దశల్లో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేపట్టి, ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకం కల్పిస్తారు.
జీతం ఎంత?
సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్‌గా ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-6 ప్రకారం జీతం లభిస్తుంది. ప్రారంభ ప్రాథమిక వేతనం రూ.35,400గా ఉంటుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.
తాజావార్తలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!