రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ పూనుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకునేందుకు పుతిన్ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అధిక ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు. దీంతో ట్రంప్‌నకు సహనం నశించింది. ఎన్ని సార్లు చెప్పినా పుతిన్ మాట వినడం లేదని కోపం కట్టలు తెంచికొచ్చినట్లుంది.