Trump Tariff: ట్రంప్ మొండివైఖరి.. భారత్‌తో చర్చలకు..!
- ట్రంప్ మొండివైఖరి
- టారిఫ్‌లపై భారత్‌తో చర్చలు ఉండవని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోతున్నాయి. నిన్నామొన్నటిదాకా రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. సుంకాలు కారణంగా ఆ బంధానికి బీటలు పడ్డాయి. కొత్తగా రష్యాతో భారత్ సంబంధాలు కొనసాగించడం ట్రంప్‌కు ఏ మాత్రం రుచించడం లేదు. ఈ నేపథ్యంలో బంధాలు మరింత దిగజారిపోయాయి.
ఇది కూడా చదవండి: Radhika Apte : గర్భవతిని అని చెప్పిన వినకుండా.. ఆ నిర్మాత చాలా ఇబ్బంది పెట్టారు
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజాగా సుంకాలపై వివాదం పరిష్కారం అయ్యేంత వరకు భారత్‌తో ఎటువంటి వాణిజ్య చర్చలు ఉండవని ట్రంప్ తేల్చి చెప్పారు. భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో తిరిగి ఇరు దేశాల మధ్య జరుగుతాయా? అని ఓవల్ ఆఫీసులో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ట్రంప్ పై విధంగా స్పందించారు.
ఇది కూడా చదవండి: Rashmika Mandanna: నా ఎమెషన్స్‌ను దాచుకోడానికి కారణం ఇదే..
ఇక ట్రంప్ టారిఫ్‌లపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. బెదిరింపులకు భారత్ భయపడదని.. టారిఫ్‌లు భరించడానికి భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తమకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మోడీ తేల్చి చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రసంగిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. భారీ మూల్యం చెల్లించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు.
భారత్‌పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అయితే రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా అదనంగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ అయింది. మొదటి 25 శాతం సుంకం ఆగస్టు 7 నుంచి అమల్లోకి రాగా.. రెండో సుంకం మాత్రం ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. కేవలం 21 రోజుల గడువు మాత్రమే ట్రంప్ ఇచ్చారు.
#WATCH | Responding to ANI's question, 'Just to follow up India's tariff, do you expect increased trade negotiations since you have announced the 50% tariffs?', US President Donald Trump says, "No, not until we get it resolved."
(Source: US Network Pool via Reuters) pic.twitter.com/exAQCiKSJd
— ANI (@ANI) August 7, 2025
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!