Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
- ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’
- ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
- ఆ హక్కు అమెరికా, చైనాకు మాత్రమే ఉందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య మరోసారి యుద్ధం జరగబోతుందా? ఈసారి పరిస్థితులు మరింత చేజారబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే శాంతి చర్చలపై మాత్రం పంచాయితీ తెగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌పై మండిపడ్డారు.
ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అత్యంత సంక్షోభ పరిస్థితిలో ఉందని హెచ్చరించారు. ఇరాన్ తాజా ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం “లైఫ్ సపోర్ట్‌పై ఉన్నట్టే” ఉందని పేర్కొన్నారు. అణు చర్చలు నిలిచిపోవడంతో ఈ సున్నితమైన ఒప్పందం ఎప్పుడైనా కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికా మద్దతుతో వచ్చిన శాంతి ప్రతిపాదనకు ఇరాన్ ఇచ్చిన సమాధానం అసంబద్ధంగా ఉందన్నారు. కీలక అణు రాయితీలు అందులో లేవని ఆరోపించారు. ఇరాన్ పంపిన ప్రతిస్పందనను పూర్తిగా చదవలేదని.. అది “చెత్త పత్రం” లాంటిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాదాపు 10 వారాలుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు అత్యంత బలహీన స్థితిలో ఉందన్నారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
‘‘ప్రస్తుతం ఇది అత్యంత బలహీనమైన ఒప్పందం. ఇది లైఫ్ సపోర్ట్‌పై ఉంది.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. పరిస్థితిని విషమ స్థితిలో ఉన్న రోగితో పోల్చుతూ.. ఈ ఒప్పందం నిలబడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు.
మరోవైపు ఇరాన్ తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. దీనిని “న్యూక్లియర్ డస్ట్”గా అభివర్ణించారు. ఆ యురేనియంను స్వాధీనం చేసుకునే సాంకేతిక సామర్థ్యం అమెరికా, చైనాకు మాత్రమే ఉందని తెలిపారు.
ఇటీవల ఇరాన్‌తో చర్చలు పునఃప్రారంభించేందుకు అమెరికా ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అయితే ఆదివారం ఇరాన్ ఇచ్చిన సమాధానంలో లెబనాన్‌లో హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలు సహా పలు ప్రాంతాల్లో శత్రుత్వ చర్యలను నిలిపివేయాలని ప్రధానంగా కోరినట్లు సమాచారం. అలాగే యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించాలని.. హార్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని, అమెరికా నౌకాదళ ఆంక్షలను ఎత్తివేయాలని, ఇరాన్‌పై విధించిన ఆంక్షలను తొలగించాలని, చమురు ఎగుమతులపై ఉన్న పరిమితులను రద్దు చేయాలని టెహ్రాన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!