Israel Political Crisis: ఇజ్రాయెల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాని పదవిని పంచుకునేందుకు నెతన్యాహు రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Political Crisis: ఇజ్రాయెల్ రాజకీయ ముఖచిత్రంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి గాదీ ఐజెన్కోట్తో ప్రధాని పదవిని పంచుకునేందుకు నెతన్యాహు సిద్ధపడ్డారని ఇజ్రాయెల్ మీడియా సంస్థ ‘ఛానల్ 13’ బాంబు పేల్చింది. రొటేషన్ పద్ధతిలో సాగే ఈ ఒప్పందంలో భాగంగా, తొలి విడతలో ఐజెన్కోట్కే ప్రధాని పీఠాన్ని అప్పగించి, రెండో విడతలో తాను బాధ్యతలు చేపట్టేందుకు నెతన్యాహు సుముఖత వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సంఖ్యాబలం లేకే రాజీ?
హమాస్ దాడులు, ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతల తర్వాత అక్టోబర్ 27న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇజ్రాయెల్ ప్రజలు ఏ కూటమికీ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. మొత్తం 120 స్థానాలు ఉన్న పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు 61 సీట్ల మెజారిటీ అవసరం కాగా, నెతన్యాహు నేతృత్వంలోని మితవాద కూటమి 53 స్థానాల వద్దే నిలిచిపోయింది. మరోవైపు ఐజెన్కోట్ కూటమికి 48 సీట్లు దక్కాయి. కీలకమైన 19 స్థానాలను అరబ్ పార్టీలైన ‘రామ్’, ‘జాయింట్ లిస్ట్’ కైవసం చేసుకున్నాయి. అయితే, అరబ్ పార్టీల మద్దతు తీసుకునే ప్రసక్తే లేదని అటు నెతన్యాహు, ఇటు ఐజెన్కోట్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అధికారాన్ని చేజార్చుకోకుండా ఉండేందుకే నెతన్యాహు అనధికారిక మార్గాల ద్వారా ఐజెన్‌కోట్‌కు ఈ రొటేషన్ ఫార్ములాను ప్రతిపాదించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే, ఈ ప్రతిపాదనపై నెతన్యాహు సొంత శిబిరంలోనే పూర్తిస్థాయి ఏకాభిప్రాయం లేకపోవడం గమనార్హం.
Also Read
- Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
- IBM H-1B Visa: IBM కీలక నిర్ణయం.. H-1B వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ నిలిపివేత.. ఉద్యోగులకు 3 వారాల గడువు
- Pakistani Astronaut: అంతరిక్షంలోకి బటర్ చికెన్, బీఫ్ నిహారీ.. పాక్ వ్యోమగామి కోసం 100కు పైగా హలాల్ వంటకాలు!
- Sheikh Hasina: ‘‘హసీనాకు ఏమైనా జరిగితే..’’ బంగ్లాదేశ్ ప్రధానికి మాజీ అమెరికన్ అధికారి హెచ్చరిక!
డిసెంబర్ 6 డెడ్‌లైన్.. లేదంటే మళ్లీ ఎన్నికలే
ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఐజెన్‌కోట్‌కు ఆహ్వానం పలికారు. మెజారిటీ నిరూపించుకునేందుకు ఆయనకు డిసెంబర్ 6 వరకు గడువు విధించారు. ఒకవేళ ఆలోగా ఐజెన్కోట్ విఫలమైతే, అధ్యక్షుడు ఆ అవకాశాన్ని నెతన్యాహుకు కల్పించే అవకాశం ఉంది. ఇద్దరు నేతలు కూడా సంఖ్యాబలాన్ని సమకూర్చుకోలేకపోతే, ఇజ్రాయెల్ మరోసారి ఎన్నికల బరిలోకి దిగడం అనివార్యమవుతుంది. ఈ ముందస్తు ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకే నెతన్యాహు ఈ రాజీ ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.
ఐజెన్కోట్ ముందున్న సవాళ్లు.. లిబర్‌మాన్ హెచ్చరికలు
నెతన్యాహు పంపిన ఆఫర్‌పై ఐజెన్కోట్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తన కూటమి భాగస్వాములైన యాయిర్ గోలన్, ‘యిస్రాయెల్ బీటెను’ పార్టీ అధినేత అవిగ్డోర్ లిబర్మాన్ల అంగీకారం లేకుండా నెతన్యాహుతో చేతులు కలపబోనని ఆయన ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే, ఇదే కూటమిలోని మరో కీలక నేత నఫ్తాలీ బెన్నెట్ మాత్రం నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీతో కలిసి ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని బహిరంగంగానే సమర్థిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, నెతన్యాహు ఎత్తుగడలపై అవిగ్డోర్ లిబర్‌మాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెతన్యాహు ఇలాంటి ఆఫర్ ఇస్తారని తాను ఈ వారమే ముందే ఊహించానని పేర్కొన్న లిబర్‌మాన్, దీనిని ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను నీరుగార్చే కుట్రగా అభివర్ణించారు. పలు అవినీతి కేసులను ఎదుర్కొంటున్న నెతన్యాహు, చర్చల పేరుతో చివరి నిమిషం వరకు కాలయాపన చేసి, ఆ తర్వాత ఒప్పందం నుంచి తప్పుకుని దేశాన్ని మళ్లీ ఎన్నికల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. డిసెంబర్ 6 గడువు సమీపిస్తున్న వేళ, ఐజెన్కోట్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఇజ్రాయెల్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
Israel Political Crisis: ఇజ్రాయెల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాని పదవిని పంచుకునేందుకు నెతన్యాహు రెడీ!
-
Kakinada Municipal Corporation Elections: కాకినాడ కౌంటింగ్‌పై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. వారికి నో ఎంట్రీ!
-
BRS Supports Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు.. కేటీఆర్ కీలక పోస్ట్..
-
TVK vs DMK: స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫామ్.. ‘సావర్కర్ 2.0’ అంటూ టీవీకే తీవ్ర విమర్శలు
-
PM Modi on Women’s Reservation Bill: నారీ శక్తిని ఎవరూ ఆపలేరు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!