భారతదేశానికి, ప్రధాని మోడీకి చాలా దగ్గరగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్‌ను ఆంక్షలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్‌పై ఆంక్షలు విధించినట్లు చెప్పుకొచ్చారు. అయినా కూడా మోడీతో చాలా దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోసారి భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: నా రెస్టారెంట్లో రూ.50 వచ్చాయి.. నా బాధ ఎవరితో చెప్పుకోను.. వరద బాధితులతో కంగనా రనౌత్ నిట్టూర్పులు
గురువారం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆంక్షలు విధిస్తే పుతిన్ దిగొస్తారని వ్యాఖ్యానించారు. చమురు ధర తగ్గితే రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణకు అంగీకరిస్తారని తెలిపారు. మోడీ బర్త్‌డే రోజున శుభాకాంక్షలు తెలియజేసినట్లు గుర్తుచేశారు. మా ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉందని వివరించారు. మోడీ, భారతదేశానికి చాలా దగ్గరగా ఉన్నానని చెప్పారు.
ఇది కూడా చదవండి: Jodhpur: బాల్కనీలో ఉన్నప్పుడు మీరు ఇలా చేస్తున్నారా? షాకింగ్ వీడియో వైరల్
రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. ఇక రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మంగళవారం చర్చలు జరిగాయి. ఇరుపక్షాలు సానుకూలంగా అభివర్ణించాయి. వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాలు ప్రయత్నాలను వేగవంతం చేయాలని నిర్ణయించాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.