కాష్ పటేల్.. భారత సంతతికి చెందిన అమెరికన్. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కీలక పదవిని కట్టబెట్టారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఎఫ్‌బీఐకు డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను నియమించారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి అధికారం చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ పాలన చాలా దూకుడుగా కనిపిస్తోంది. ఇటీవల వాణిజ్య యుద్ధం ప్రకటించగా మార్కెట్లు చతికలపడ్డాయి. అనంతరం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. అలాగే సంస్థాగతం కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు.