Lebanon: హిజ్బుల్లా టాప్ కమాండర్ హమాది హతం.. ఇంట్లో ఉండగా కాల్చివేత
- హిజ్బుల్లా టాప్ కమాండర్ హమాది హతం
- ఇంట్లో ఉండగా కాల్చివేత
- ఎఫ్‌బీఐ దృష్టిలో దశాబ్దాలుగా కంటిలో నలుసుగా ఉన్న హమాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ఎఫ్‌బీఐ దృష్టిలో దశాబ్దాలుగా కంటిలో నలుసుగా ఉన్న మోస్ట్ వాంటెడ్, సీనియర్ హిజ్బుల్లా కమాండర్ షేక్ ముహమ్మద్ అలీ హమాది హతమయ్యాడు. మంగళవారం రాత్రి తూర్పు లెబనాన్‌లో ఇంట్లోకి రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఇంటి వెలుపల ఉండగా ఈ కాల్పులు జరిగాయి. ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే హమాది మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు లెబనాన్ వార్తాపత్రిక అల్ అఖ్బర్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ.. సర్కార్ నిర్ణయం
Also Read
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
అయితే ఈ హత్య వెనుక ఉన్న ఉద్దేశం అయితే బయటకు రాలేదు. అయితే దీర్ఘకాలంగా ఉన్న కుటుంబ కలహాలు కారణంగా ఈ హత్య జరిగినట్లుగా స్థానిక మీడియా కథనాలు పేర్కొ్న్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఏదైనా గ్రూప్ ఈ దాడికి పాల్పడిందా? లేదంటే ఇంకేమైనా జరిగిందా? అన్నది ఇంకా తేలలేదు.
హమాది దశాబ్దాలుగా ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. చాలా కాలంగా పరారీలో ఉన్నాడు. ఓ ఉగ్రదాడిలో ఇతడి ప్రమేయం ఉందన్న కారణంతో ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది. 1985లో అనేక మంది అమెరికన్లతో సహా 153 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న లుఫ్తాన్స ఫ్లైట్ 847ను పశ్చిమ జర్మన్ విమానాన్ని హైజాక్ చేశాడు. హైజాకింగ్ సమయంలో ఒక అమెరికన్ జాతీయుడ్ని చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. ఇందులో హమాది ప్రమేయం ఉన్నట్లుగా తేల్చారు. దీంతో యూఎస్.. వాండెడ్ నేరస్థుల జాబితాలో చేర్చింది.
ఇది కూడా చదవండి: Ajay Maken: కేజ్రీవాల్ ప్రభుత్వం రూ. 382 కోట్ల కుంభకోణానికి పాల్పడింది..
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!