Karimnagar: ఒకే పెళ్లికి రెండుసార్లు రిజిస్ట్రేషన్.. కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: కరీంనగర్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకే వివాహానికి రెండుసార్లు రిజిస్ట్రేషన్ జరిగిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఈ అంశం అధికారుల పనితీరుపై తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. వివాహాల నమోదు విషయంలో అధికారులు ఎలాంటి పరిశీలన చేస్తున్నారు, ఒకే వివాహాన్ని రెండుసార్లు నమోదు చేయడానికి ఎలా అవకాశం కల్పించారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే, 2015లో ఓ జంటకు వివాహం జరిగింది. అనంతరం 2018లో హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వారి వివాహాన్ని నమోదు చేసుకున్నారు. అయితే, అప్పటికే వివాహం జరిగి రిజిస్ట్రేషన్ పూర్తయినప్పటికీ, అదే జంట 2024లో మరోసారి వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయినప్పటికీ రెండోసారి నమోదు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది అంతుచిక్కడం లేదు.
Also Read
- Bhogi Movie Review: భోగి మూవీ రివ్యూ..
- Suryakumar Yadav: ఆరు మ్యాచ్‌లు.. ఆరు విజయాలు.. ముంబై జైత్రయాత్ర.. కెప్టెన్సీతో అదరగొట్టిన స్కై..!
- TG Climate Conclave 2026: ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళిక.. డిసెంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి కీలక రోడ్‌మ్యాప్..
- Delimitation 2026: లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపు? డీలిమిటేషన్‌పై కేంద్రం కీలక ప్రతిపాదన!
సాధారణంగా ఒక్కసారి వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికే జంటలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, ఒకే వివాహానికి రెండుసార్లు రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వివాహ సమయంలో ఒకసారి, సంతానం కలిగిన తర్వాత మరోసారి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వెనుక కారణాలేమిటనే చర్చ సాగుతోంది. ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనం పొందేందుకే రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా లేక అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులెవరు, ఏజెంట్లెవరు అనే విషయం కూడా సామాన్య ప్రజలకు అంతుచిక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాంటి నియంత్రణ లేకుండా డాక్యుమెంట్ రైటర్లు నేరుగా రిజిస్ట్రేషన్ ఆన్లైన్ టేబుళ్ల వద్దకు వెళ్తుండటంతో కార్యాలయంలో అధికారిక విధులు, ఇతరుల జోక్యంపై అయోమయం నెలకొంటోందని ప్రజలు అంటున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. రెండోసారి రిజిస్ట్రేషన్‌కు అనుమతించిన కారణాలు, సంబంధిత పత్రాల పరిశీలన, అలాగే ప్రభుత్వ పథకాల ప్రయోజనాల దుర్వినియోగం జరిగిందా లేదా అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Karimnagar: ఒకే పెళ్లికి రెండుసార్లు రిజిస్ట్రేషన్.. కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏం జరుగుతోంది?
-
Suryakumar Yadav: ఆరు మ్యాచ్‌లు.. ఆరు విజయాలు.. ముంబై జైత్రయాత్ర.. కెప్టెన్సీతో అదరగొట్టిన స్కై..!
-
TG Climate Conclave 2026: ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళిక.. డిసెంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి కీలక రోడ్‌మ్యాప్..
-
Delimitation 2026: లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపు? డీలిమిటేషన్‌పై కేంద్రం కీలక ప్రతిపాదన!
-
IND vs NZ 2nd Test: జడేజా, సిరాజ్‌లను పక్కన పెట్టారు.. భారీ మూల్యం చెల్లించారు!
ట్రెండింగ్
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!