Donald Trump: కాలేజీల నుంచి రాడికల్ లెఫ్ట్, ఉన్మాదుల్ని తొలగిస్తా.. ట్రంప్ సంచలనం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- యూఎస్ కాలేజీల నుంచి రాడికల్ లెఫ్ట్ ఉన్మాదుల్ని తొలగిస్తా..
- ఇటీవల పలు వర్సిటీల్లో పాలస్తీనా అనుకూల ఉద్యమాలు..
- ఈ నేపథ్యంలోనే ట్రంప్ నుంచి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో ఆ దేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముక్యంగా రాడికల్ లెఫ్ట్ లిబరల్స్‌పై ట్రంప్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలోని విద్యా సంస్థల్లో రాడికల్ లెఫ్ట్‌ని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు అక్రిడేషన్ వ్యవస్థనను ఉపయోగిస్తానని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్ష పదవి చేపట్టగానే కాలజీల్లో ‘‘మార్క్సిస్టులు, ఉన్మాదులను తొలగిచేందుకు రాడికల్ లెఫ్ట్ అక్రిడిటర్లను ట్రంప్ తొలగిస్తారని ఆయన అన్నారు.
Read Also: TFCC : ఘనంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
ట్రంప్‌కి సంబంధించిన వీడియోని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పంచుకున్నారు. రిపబ్లికన్ తన పరిపాలన కొత్త అక్రిడిటర్లను నియమిస్తుందని చెప్పారు. కష్టపడి పనిచేసి అమెరికన్ల నుంచి వందల బిలియన్ డాలర్లతో నడిచే విద్యా సంస్థలు ‘‘అమెరికన్ వ్యతిరేక పిచ్చితనం’’ నుంచి బయటపడటానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. జాతి వివక్షకు పాల్పడుతున్న పాఠశాలలపై ఫెడరల్ పౌర హక్కుల కేసులను కొనసాగించాలని న్యాయ శాఖను తాను నిర్దేశిస్తానని ట్రంప్ అన్నారు. ‘‘సమానత్వం’’ ముసుగులో చట్టవిరుద్ధమైన వివక్షకు పాల్పడే స్కూల్స్‌పై జరిమానా విధించేందుకు, జరిమానా విధించే చట్టాలను తీసుకువస్తానని చెప్పారు.
‘‘లింగమార్పిడి పిచ్చితనం’’ బోధించే ఏ పాఠశాలకైనా నిధులను తగ్గించాలని, ‘‘దేశభక్తి విలువలను’’ స్వీకరించి అమెరికన్ జీవన విధానాన్ని సమర్థించే ఉపాధ్యాయులకు క్రెడెన్షియల్‌ని అందించాలని ప్రతిపాధించారు. హార్వర్డ్, న్యూయార్క్ యూనివర్శిటీ, యేల్, ఎమర్సన్ కాలేజ్ మరియు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సహా పాలస్తీనా అనుకూల, ఇజ్రాయిల్ వ్యతిరేక ఉద్యమాలు ఎగిసి పడిన సందర్భంగా ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
— Elon Musk (@elonmusk) November 11, 2024
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!