ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో విద్యా శాఖ సమస్యలను తెలుసుకోవడానికి సోమవారం జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఆన్‌లైన్‌లో జరిగింది. ఈ సమయంలో, గూగుల్ మీట్‌తో అనుసంధానించబడిన ఒక వ్యక్తి సమావేశం సమయంలో ఒక అశ్లీల వీడియోను ప్లే చేశాడు. అయితే, స్క్రీన్‌పై వీడియో ప్లే అవుతున్నట్లు చూసిన వెంటనే, డిఎం దానిని ఆపివేసి, ఎస్పీతో మాట్లాడుతూ, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని సైబర్ పోలీసులను ఆదేశించారు. Also Read:Ram Gopal…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. అధికారం చేపట్టిన నాటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. వలసలను కఠినతరం చేస్తూ.. పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తూ సంచలనంగా మారారు. తాజాగా యూఎస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్యా శాఖను రద్దు చేస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. వైట్ హౌస్ తూర్పు గదిలోని డెస్క్‌ల వద్ద కూర్చున్న పాఠశాల పిల్లలతో ఒక ప్రత్యేక…
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో ఆ దేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముక్యంగా రాడికల్ లెఫ్ట్ లిబరల్స్‌పై ట్రంప్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలోని విద్యా సంస్థల్లో రాడికల్ లెఫ్ట్‌ని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పనుల మీద బయటకు వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం.. చాలా వరకు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉండటంతో రేపు (శనివారం) కూడా…
బీహార్ ప్రభుత్వం కార్యాలయాల్లో కొనసాగుతున్న సంస్కృతికి విరుద్ధంగా ఉన్నందున కార్యాలయంలో జీన్స్, టీ-షర్టులు వంటి సాధారణ దుస్తులను ధరించవద్దని రాష్ట్ర విద్యా శాఖ సిబ్బందికి తెలిపింది. టీషర్టులు, జీన్స్‌లతో కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులకు మినహాయింపు ఇస్తూ విద్యాశాఖ డైరెక్టర్ (పరిపాలన) బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ మూలాలు ఉన్న కుర్రాడు కూడా ఇపుడు ప్రతిష్ఠాత్మకమైన ‘అమెరికా ప్రెసిడెన్షియల్ స్కాలర్‌షిప్-2023’కు ఎంపికయ్యాడు. వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్‌లో హైస్కూల్ సీనియర్స్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న తేజ కోడూరు 2023 ఏడాదికి గాను ‘ప్రెసిడెన్షియల్ స్కాలర్‌షిప్’కు ఎంపికైనట్టు అమెరికా విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి సోమవారం (జూన్ 13) నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకుంటున్నాయి. సుమారు 60 లక్షల మంది విద్యార్ధులు బడిబాట పట్టనున్నారు. కోవిడ్ కేసుల పెరుగుదల, పుస్తకాల పంపిణీ పూర్తవకపోవడం, వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతన్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారన్న ప్రచారం జరిగినా.. ఆ ఊహాగానాలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెరదించారు. జూన్ 13వ తేదీ నుంచి యథావిథిగా పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని స్పష్టం చేసారు.…
ఓ వైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం మళ్లీ తల్లిదండ్రుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఈ ఏడాది కూడా తమ పిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతాయా.? అనే భయాందోళల్లో తల్లిదండ్రులు ఉన్నారు. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయా.? లేదా.? అనే సందేహాలు తలెత్తాయి. అయితే జూన్ 13 నుంచి యాథాతథంగా స్కూళ్లు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. సెలవులను పొడగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపటి నుంచి…