Tarique Rahman: బంగ్లా ప్రధాని ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. మోడీ వెళ్తారా..?
- బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్..
- ఫిబ్రవరి 17న ప్రమాణస్వీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tarique Rahman: రెండేళ్ల అనిశ్చితి తర్వాత బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఇటీవల జరిగిన బంగ్లా ఎన్నికల్లో ‘‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ)’’ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మన్ బంగ్లాదేశ్ ప్రధాని కాబోతున్నారు. ఫిబ్రవరి 17న తారిఖ్ రెహ్మాన్ తన మంత్రి వర్గంతో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి భారత్‌తో సహా దక్షిణాసియా దేశాధినేతల్ని ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది. యూనస్ పాలనతో భారత్ బంగ్లాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఒక వేళ మోడీ ఢాకా వెళ్తే ఇది దౌత్యపరంగా ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.
Read Also: HYD SPA VYABHICHARAM: మసాజ్ థెరపిస్టుల పేరుతో యువతుల నియామకం.. క్రాస్ మసాజ్ చేయుస్తున్న ముఠాలు
Also Read
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
కొత్త ప్రధాని, ఆయన మంత్రివర్గం సాధారణంగా బంగ్లాదేశ్ అధ్యక్ష భవనం, బంగభవన్‌లోని దర్బార్ హాలులో ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే, ఈసారి మాత్రం ప్రమాణస్వీకారోత్సవం జాతీయ సంసద్ భవన్‌లోని సౌత్ ప్లాజాలో జరుగుతుంది. విదేశాల నుంచి అతిథులు వస్తుండటంతో వేడుకల్ని సౌత్ ప్లాజాలో జరుగుతుందని అక్కడి అధికారులు తెలిపారు. ఏయే దేశాధినేతలు హాజరవుతారనే దానిపై ఆదివారం క్లారిటీ వస్తుందని చెప్పారు. 300 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ 209 స్థానాలు గెలుచుకుంది. మూడింట రెండువంతుల మెజారిటీని దక్కించుకుంది. ఇక జమాతే ఇస్లామీ పార్టీ 68 స్థానాలను గెలుచుకుంది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!