August 15 Independence Day: భారత్‌తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
- భారత్ 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం..
- ఉత్తర, దక్షిణ కొరియాలకు 1945 ఆగస్టు 15న జపాన్ పాలన నుంచి విముక్తి..
- బహ్రెయిన్ ,లిచెన్స్టెయిన్లో ఆగస్టు 15తో సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Independence Day 2022: బ్రిటీష్ వలస పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం లభించి 79 ఏళ్లు అవుతోంది. 2026 ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే భారత్ తో పాటు అదే రోజు మరో 4 దేశాలు కూడా బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందాయి. ఈ దేశాలు కూడా ఒక రకంగా ఆగస్టు 15నే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయని తెలుసా..? భారత్ లాగే ఆ దేశాలు కూడా వలసవాదం, పరాయి పాలన నుంచి విముక్తి పొందాయి.
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా
జపాన్ పాలనలో 35 ఏళ్ల పాటు ఉన్న ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలకు కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్రం వచ్చింది. రెండు కొరియా దేశాలను అమెరికా, దాని మిత్ర దేశాలు జపాన్ పాలన నుంచి విముక్తి చేశాయి. ఆగస్టు 15న జాతీయ విముక్తి దినోత్సవం లేదా గ్వాంగ్ బోక్ జియోల్( కాంతి పునరుద్ధరణ సమయం)గా కొరియా దేశాలు పిలుస్తాయి. కొరియా యుద్ధం తరువాత ఈ రెండు దేశాలు విడిపోయాయి. ఈ యుద్ధం 1950-53 వరకు కొనసాగింది.
Also Read
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
- Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
లిచెన్ స్టెయిన్
లిచెన్ స్టెయిన్ దేశం కూడా ఆగస్టు 15నే స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటుంది. ప్రపంచంలో అతి చిన్న దేశాల్లో ఆరో దేశంగా లిచెన్ స్టెయిన్ ఉంది. ఈ రోజును స్టాట్స్ ఫీయర్ ట్యాగ్ అని పిలుస్తుంది. ఈ తేదీని ప్రిన్స్ ఫ్రాంజ్ జోసెఫ్ 2 పుట్టిన రోజును కూడా జరుపుకుంటుంది. ఆగస్టు 15ను లిచెన్‌స్టెయిన్ జాతీయ దినోత్సవంగా 1940 నుంచి పాటిస్తోంది. ఈ రోజుకు దేశ రాజకుటుంబంతోనూ సంబంధం ఉంది.
బహ్రెయిన్
బహ్రెయిన్ జనాభాపై ఐక్యరాజ్యసమితి సర్వే తరువాా.. ఆగస్ట్15, 1971న బహ్రెయిన్ బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందింది. అయితే ఇక్కడి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రాన్ని ఆగస్టు 15న పొందినప్పటికీ.. ఆ దేశం ఆగస్టు 15 స్వాతంత్య్రం జరుపుకోదు. బహ్రెయిన్ దివంగత పాలకుడు ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీప్ సింహాసనాన్ని అధిరోహించిన రోజున ఏటా డిసెంబర్ 16న జాతీయ దినోత్సవంగా జరుపుకుంటుంది.
తాజావార్తలు
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!