పంజ్‌షీర్‌లో ఎగిరిన తాలిబన్ల జెండా.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగదెబ్బ.. వెన్నుపోటు. పాకిస్థాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. తాలిబన్లతో ఎలాంటి సంబంధం లేదని పైకి చెబుతూనే వాళ్ల తరఫున యుద్ధం చేసేందుకు ఉగ్రవాదులను పంపింది పాక్. పంజ్ షీర్ సింహాలను నేరుగా ఢీకొట్టలేని తాలిబన్లు.. కుట్రలమారి పాకిస్థాన్ అండ తీసుకున్నారు. యుద్ధంలో తామే గెలిచా మని పంజ్ షీర్‌లో జెండా ఎగరేశారు. పంజ్ షీర్ గవర్నర్ బంగ్లా దగ్గర తాలిబన్ నేతలు ప్రశాంతంగా కనిపిస్తున్నా.. దాని కొండ ప్రాంతంలోని లోయల్లో మాత్రం భీకర యుద్ధం నడుస్తోది. పచ్చటి ప్రకృతి సౌందర్యాలపై రక్తం చిల్లిపడుతోంది. బాంబు దాడుల్లో… తుపాకీ బుల్లెట్ల వర్షంలో మనుషుల దేహాలు ముక్కలైపోతూనే ఉన్నాయి. గడిచిన వారం రోజుల నుంచి తాలిబన్లతో పంజ్ షీర్ యోధులు భీకరంగా పోరాడుతున్నారు.
ప్రపంచ దేశాలు మొండి చేయి ఇవ్వండంతో పంజ్‌షీర్‌లోని ఉత్తరాది తిరుగుబాటు దళాలు తాలిబన్లతో పోరాడి అలసిపోతున్నాయి. పద్మవ్యూహం లాంటి పంజ్ షీర్లోకి వెళ్లేందుకు గడిచిన రెండు వారాలుగా తీవ్రంగా ప్రయత్నించిన తాలిబన్లు.. ఎట్టకేలకు చేరుకోగలిగారు. భారీ భారీ బలగాల తోపాటు మందుగుండు సామాగ్రిని వెంట తీసుకెళ్లారు. తాలిబన్ల ఎంట్రీతోనే పంజ్ షీర్‌లో ఉన్న బలగాలు కొండ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. కొండల్లోని ఉత్తరాది బలగాలు.. కొండ కింది భాగం నుంచి తాలిబన్లు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. పంజ్ షీర్ యోధులు కొండ ప్రాంతంలోకి వెళ్లడంతోనే తాలిబన్ లీడర్లు పంజ్ షీర్‌లో ప్రత్యక్షమయ్యారు. గవర్నర్ కోటపైన తాలిబన్ల జెండాను ఎగురువేసి పంజ్ షీర్ తమ ఆధీనంలోకి వచ్చిందని ప్రకటించేశారు. ఇటు ఆప్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఇంటిని బాంబులతో పేల్చేశారు. పంజ్ షీర్ బలగాలకు నాయకుడిగా ఉన్న అహ్మద్ మసౌద్ కూడా ఇప్పుడు కొండ ప్రాంతంలోకి వెళ్లిపోయారు. అయితే, ఓ ఆడియోల రిలీజ్ చేశారు పంజ్‌షీర్ నేత అహమ్మద్ మస్సౌద్.. 19 నిమిషాల పాటు ఉన్న ఆ సుదీర్ఘ ఆడియోలో.. తాలిబన్లపై దేశమంతా తిరగబడాలని పిలుపునిచ్చారు.. తమ దళాలపై మిలిటెంట్లు దాడి చేశారని, మతపెద్దల సూచనలను కూడా తాలిబన్లు పట్టించుకోలేదన్న ఆయన.. తాలిబన్ల దాడుల్లో తన స్వంత కుటుంబీకులు కూడా మరణించినట్లు తెలిపారు. ఇక, తాలిబన్లకు గుర్తింపు తెచ్చిపెట్టిన ప్రపంచ దేశాలను తప్పుబట్టిన మస్సౌద్.. సైన్యాన్ని, రాజకీయ విశ్వాసాన్ని తాలిబన్లకు కల్పిస్తున్న దేశాలపై మండిపడ్డాడు.. అయితే, పంజ్‌షీర్‌లో తమ దళాలు ఇంకా బలంగా ఉన్నాయని, తాలిబన్లతో పోరాడుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు