Voyager 1: ఐదు దశాబ్ధాల క్రితం నాసా ప్రయోగించిన ‘వాయేజర్ 1’ అంతరిక్ష నౌక ప్రాణం పోసుకుంది. గత కొన్ని నెలల క్రితంగా విశ్వంలో దాని జాడ తెలియకుండాపోయింది.
Mars: సౌర కుటుంబంలో భూమి తర్వాత జీవులు ఉండేందుకు ఏకైక ప్రదేశంగా అంగారకుడు చెప్పబడుతున్నాడు. ఒకప్పుడు నదులు, సముద్రాలతో విలసిల్లిన గ్రహం ప్రస్తుతం బంజెరు భూమిగా మారింది. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం నుంచి ఆ గ్రహం నిస్సారంగా మారిపోయింది. అయితే ఇప్పటికే అక్కడ జీవులకు సంబంధించిన వివరాలను, గతంలో ఎలా ఉండేదో అనే ఉత్సుకత ఇప్పటికీ పరిశోధకుల్లో ఉంది. అందుకే మార్స్ గ్రహానికి అనేక రోవర్లు, ల్యాండర్లను వివిధ దేశాల అంతరిక్ష సంస్థలు పంపాయి.
Mercury: సౌరకుటుంబంలో బుధ గ్రహానికి ఓ ప్రత్యేక ఉంది. సూర్యుడికి అతిదగ్గరగా ఉన్న, అతిచిన్న గ్రహాం. అయితే బుధుడి గురించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బుధ గ్రహం క్రమక్రమంగా కుచించుకుపోతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు
Jupiter: సౌరకుటుంబంలో అతిపెద్ద గ్రహం, భారీ వాయుగోళం గురుగ్రహంపై మరోసారి ఫ్లాష్ లైట్ కనిపించింది. ఎప్పుడు చూడని విధంగా ఈ ఫ్లాష్ ఉంది. ఇలాగే గతంలో అంతరిక్ష వస్తువులు గురుగ్రహంలో కూలిపోవడంతో భారీ వెలుగులు కనిపించాయి. తాజా నమోదైన ఈ వెలుగు, ఇది వరకు ఎప్పుడూ చూడని విధంగా ఉందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. ఆగస్టు 28న ఇది రికార్డ్ అయింది.
Earth Like Planet: విశ్వం అంతా మహాసముద్రం అనుకుంటే ఇప్పటి వరకు మనకు తెలిసింది కేవలం ఒక నీటి చుక్క మాత్రమే. ఇంత పెద్దదైన బ్రహ్మాండంలో భూమిలాంటి గ్రహాలు లక్షల్లో ఉన్నా కూడా వాటిని మనం గుర్తించలేము. ఎందుకంటే మన సూర్యుడు ఉన్న మిల్కీవే గెలాక్సీలోనే కొన్ని మిలియన్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. మిల్కీవే గెలాక్సీని దాటాలంటేనే కొన్ని వేల ఏళ్ల కాంతి సంవత్సాల సమయం పడుతుంది. అలాంటిది ఈ విశ్వంలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి.
Jupiter: సౌర కుటుంబంలో అత్యంత పెద్ద గ్రహం గురుగ్రహం. దాదాపుగా 1300 భూమిలను తనలో ఇముడ్చుకోగలదు. సూపర్ గ్యాస్ జాయింట్ అయిన గురుగ్రహం సౌరకుటుంబంలో ‘వాక్యూమ్ క్లీనర్’గా పనిచేస్తుంటుంది. తన అపారమైన గురుత్వాకర్షణ శక్తితో గ్రహశకలాలను, తోకచుక్కలను తనవైపు ఆకర్షిస్తుంటుంది.
Largest Cosmic Explosion: ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చూడని అతిపెద్ద కాస్మిక్ పేలుడును కనుగొన్నారు. ఈ సంఘటన భూమికి 8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది. ఈ పేలుడు దాదాపుగా 3 ఏళ్ల పాటు కొనసాగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. మనకు తెలిసిన సూపర్ నోవా విస్ఫోటనం కన్నా పది రెట్లు అధిక ప్రకాశవంతంగా ఉన్నట్లు వెల్లడించారు.
Voyager-2: 1977లో భూమి నుంచి ప్రయోగించి వాయేజర్ -2 అంతరిక్ష నౌక ఇప్పటికీ విశ్వ రహస్యాలను భూమికి పంపిస్తూనే ఉంది. మన సౌర వ్యవస్థను దాటేసి సూర్యుడి ప్రభావం అస్సలు లేని ఇంటర్ స్టెల్లార్ స్పేస్ లో ప్రయాణిస్తోంది. 1977లో విశ్వ రహస్యాలను తెలుసుకునేందుకు వాయేజర్ 1, వాయేజర్-2 అంతరిక్ష నౌకల్ని నాసా ప్రయోగించింది. భూమికి సుదూరంగా ఉన్న గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాల అధ్భుత ఛాయాచిత్రాలను భూమికి పంపించాయి. తాజాగా వాయేజర్ 2…
12 new moons found around Jupiter: గురు గ్రహం సౌరవ్యవస్థలో సూర్యుడి తర్వాత అతిపెద్ద గ్రహం. సైన్స్ ప్రకారమే కాకుండా.. పురాణాల్లో, జోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ప్రముఖ స్థానం ఉంది. శుభాలకు కారకుడిగా బృహస్పతి గ్రహాన్ని భావిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా గురు గ్రహం చుట్టూ తిరుగుతున్న 12 కొత్త చంద్రులను కనుక్కున్నారు.
How And When Will The Sun Die?: సౌరకుటుంబానికి ప్రధాన ఆధారం సూర్యుడు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి, కాంతితోనే ఈ సమస్య సౌరకుటుంబం నిలబడి ఉంటోంది. ముఖ్యంగా భూమిలాంటి గ్రహానికి సూర్యుడు నుంచి వచ్చే శక్తి చాలా అవసరం. ఎందుకంటే ఇతర గ్రహాలతో చూస్తే ఒక్క భూమిపై మాత్రమే జీవజాలం ఉంది. సమస్త జీవజాలం బతకాలంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి అత్యవసరం. కిరణజన్య సంయోగక్రియ, భూమిని వెచ్చగా ఉంచడానికి సూర్యడు సహాయకారిగా ఉన్నారు. భూమిపై…