Covid-19: ఆరేళ్ల క్రితం ఇదే రోజు అంటే, డిసెంబర్ 31, 2019 ప్రపంచమంతా ‘‘న్యూ ఇయర్’’ వేడుకలకు సిద్ధమవుతోంది. ప్రజలంతా కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ అదే సమయంలో ఒక మహమ్మారి పురుడుపోసుకుంది. అదే ‘‘కోవిడ్-19’’. మానవ చరిత్రలో ఆధునిక కాలంలో మనిషి ఎప్పుడూ చూడని ప్రళయాన్ని సృష్టించింది. ప్రజలందర్ని కేవలం ఇళ్లకే పరిమితం చేసింది. ‘‘లాక్‌డౌన్’’తో జనజీవితం అస్తవ్యస్తమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంత కాదు.. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ నుంచి కాస్త పరిస్థితి కుదుటపడుతుండగా.. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి. తాజాగా థర్డ్ వేవ్‌పై వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ).. కరోనా థర్డ్ వేవ్ తప్పదని.. అది కూడా త్వరలోనే రాబోతోందని ఐఎంఏ హెచ్చరించింది. ఓవైపు ఇలాంటి పరిస్థితులున్నా.. అధికారులు, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఏంటి? అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది ఐఎంఏ.. ఇప్పటికే ఫస్ట్ వేవ్,…