Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధినేత పుతిన్ గురించి సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న వేళ జెలెన్స్కీ ప్రకటన సంచలనంగా మారింది. ‘‘త్వరలోనే పుతిన్ చనిపోతారు’’ అని, ఇది రెండు దేశాల మధ్య యుద్ధం ముగింపుకు సాయపడుతుందని అన్నారు. పారిస్‌లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ పుతిన్ ఆరోగ్యం పరిస్థితులపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అతను(పుతిన్) త్వరలోనే చనిపోతారు. ఇది…
Vladimir Putin: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతన్ ఆరోగ్యంపై వదంతులు వస్తూనే ఉన్నాయి. పుతిన్ ఆరోగ్యం చాలా క్షీణించందని, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, క్యాన్సర్ తో ఇబ్బందిపడుతున్నారని పలు వార్తలు వచ్చాయి. తాజాగా వచ్చిన ఓ నివేదిక పుతిన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలిపింది. అతడి ఆరోగ్యంపై వైద్యులు భయాందోళనలో ఉన్నట్లు తెలిపింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయారని అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అందరి దృష్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ పై పడింది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వివిధ కథనాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపైనా రకరకలా ఊహగానాలు వెలువడుతుండడంతో అందరూ ఆయనకు ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారు. పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. ఎక్కువ రోజులు బతికి ఉండలేరని ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. వ్లాదిమిర్ పుతిన్…