Heavy Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, నేడు ఈ ద్రోణి మరింత బలపడడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గురువారం మధ్యాహ్నం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు నేడు, రేపు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Film Workers Strike: నేడు సినీ కార్మికుల సమ్మె చర్చలకు విరామం.. రేపు తిరిగి చర్చలు ప్రారంభం!
ఇక రాష్ట్రంలోని రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, సూర్యాపేట, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఇకపోతే, గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది.
Kesamudram: అర్ధరాత్రి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం!
దీనితో హైదరాబాద్ జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో వరదలు తలపించేలా కుండపోత వర్షం పడింది. దీంతో రహదారులు చెరువుల్లా మారి, ఎక్కిడిక్కడ వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కానీ నేడు నగరంలో గురువారం నాటి దారుణ పరిస్థితులు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ వెళ్ళడనిచ్చింది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండి, సాయంత్రం నుంచి కొని ప్రాంతాలలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.