భారత్‌లో రష్యా అధ్యక్షుడి పర్యటన ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన భారత పర్యటన ఖరారైంది. భారత్- రష్యా దేశాల మధ్య జరిగే 21వ వార్షిక సమావేశంలో భాగంగా వచ్చే నెల 6న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి రానున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ భేటీలో ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలను చర్చించనున్నట్లు తెలిపింది. అలాగే ఇరుదేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు కూడా భేటీ కానున్నట్లు పేర్కొంది.
Read Also: కొత్త వేరియంట్ దెబ్బ… రూ.7.45 లక్షల కోట్లు ఆవిరి
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
ఈ సమావేశంలో హిందూ మహాసముద్రం, ఆఫ్ఘనిస్తాన్, సిరియా వంటి ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల్లో పురోగతి, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించడంతో పాటు ఈ సమావేశంలో పలు ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేయనున్నారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత రష్యా ప్రెసిడెంట్‌కు ఇది రెండో విదేశీ పర్యటన కాగా.. రెండోసారి భారత్‌కు రానున్నారు. 2018లో చివరిసారిగా భారత్‌లో పర్యటించిన పుతిన్.. ప్రధాని మోదీని కలిసి రెండు దేశాల మధ్య పలు రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాగా ఈ భేటీలో క్షిపణి విధ్వంసక వ్యవస్థ S-400 సరఫరాపై ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!