Republic Day: భారతదేశం ఈ రోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. రాష్టపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాలు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా భారత్‌కి శుభాంక్షలు చెబుతున్నాయి. భారత మిత్ర దేశం రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని పంపారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాల్లో అమెరికా అణ్వాయుధాలను మోహరించినట్లే బెలారస్‌లో తాము అణ్వాస్త్రాలను ఉంచే యోచనలో ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు.
PM Modi, Russian President Vladimir Putin speak on phone: భారత్, రష్యా మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇరు నేతలు రెండు దేశాల దౌత్య సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సంభాషించినట్లు పీఎంఓ తెలిపింది. ఉక్రెయిన్ తో యుద్ధంలో దౌత్యమే ఏకైక మార్గమని ప్రధాని మోదీ పుతిన్ కు పునరుద్ఘాటించారని వెల్లడించింది. పుతిన్, మోదీతో మాట్లాడినట్లు క్రెమ్లిన్ వర్గాలు కూడా ధృవీకరించాయి.
కొన్ని దేశాలు మినహా మెజార్టీ దేశాలు తనపై ఆంక్షలు విధిస్తున్నా యుద్ధంపై వెనక్కి తగ్గడం లేదు రష్యా.. 25 రోజులకు పైగా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది.. ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నా.. ఇక యుద్ధానికి పులిస్టాప్ అంటూ కొంత ప్రచారం సాగుతున్నా.. ఉక్రెయిన్‌పై పట్టుకోసం రష్యా బలగాలు చెమటోడుస్తూనే ఉన్నాయి.. ఉక్రెయిన్ సైన్యం నుంచి కూడా ఇంకా తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు. అయితే, ఇదే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ప్రేయసిని చిక్కుల్లోకి…
ఉక్రెయిన్ యుద్ధం రోజులకు రోజులుగా సాగుతుండటం రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతోందా? ఆయన అనుకున్నది ఒకటైతే జరుగుతోంది మరొకటా? రష్యా సైన్యం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భావవనలో ప్రస్తుతం పుతిన్ ఉన్నారు. సంవత్సరాలుగా ఆయన మనసెరిగిన పశ్చిమ దేశాల గూఢచార వర్గాలు ఈ అంచనాకు వచ్చారు. పుతిన్ ఇకముందు ఎలాంటి చర్యలకు దిగుతాడో ఆర్థంకాక ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్దం సాగుతున్న తీరు పుతిన్‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఆయన ఆరోగ్యంపైనా అనుమనాలు…
ఉక్రెయిన్‌లోని ఎయిర్ పోర్టులు, షిప్ యార్డులపైనే కాదు ప్రజల ఇళ్లు, ఆసుపత్రులు, స్కూళ్లపైనా రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా మరిమాపొల్‌లోని ఓ ఆర్ట్ స్కూల్‌పై బాంబులతో దాడి చేశాయి. దాదాపు 400 మంది తలదాచుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. అయితే ఇలాంటివన్నీ యుద్ధ నేరాలేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. యుద్ధంలో తొలిసారిగా మొన్న ఓ ఆయుధాగారంపై కింజాల్ హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా.. నిన్న సైతం…
ఒక పథకం, షెడ్యూల్ ప్రకారం ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. పోరాటం ఆపి లొంగిపోయే వరకు, తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం కొనసాగిస్తామని ఉక్రెయిన్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. మూడో దఫా జరిగే శాంతి చర్చల్లో నిర్మాణాత్మక విధానాన్ని అవలంభించడం మంచిదని ఉక్రెయిన్‌కు పుతిన్ సూచించారు. కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం సుదీర్ఘంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం పదో రోజుకు చేరుకుంది… ఐదున్నర గంటల తాత్కాలిక విరమణ తర్వాత మళ్లీ భీకర యుద్ధం కొనసాగిస్తోంది రష్యా.. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానం అన్నారు పుతిన్.. నాటో దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.. ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పుతిన్… ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని సమర్థించుకున్న ఆయన.. శాంతియుతంగా…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి పది రోజులైంది. పుతిన్ బలగాలను ఉక్రెయిన్ సైన్యం, పౌరులు కలిసికట్టుగా ఎదిరిస్తున్నారు. అయినా ప్రత్యర్థి దేశంలోని ఒక్కో నగరాన్ని, పట్టణాన్ని వ్యూహాత్మక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఇంకా అమెరికా, నాటోపై ఆశ చావలేదు. ఓ వైపు ఉక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం సృష్టిస్తూనే రష్యా మరోపక్క చర్చలు జపం చేస్తోంది. రష్యా చర్యను ఇప్పటికే మెజార్టీ దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఐక్యరాజ్య సమితి వేధికగా దాడిని…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ వ్యూహం మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రెండో దఫా చర్చల్లో పౌరులు సురక్షితంగా తరలివెళ్లడానికి రష్యా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే, తొమ్మిదో రోజు దాడుల్లో ఆ హామీకి కట్టుబడుతూనే.. ఉక్రెయిన్‌లోని భారీ పవర్ ప్లాంట్‌లను రష్యా టార్గెట్ చేసింది. యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియాలో ఉంది. దానిపై రష్యా వరుస దాడులకు పాల్పడింది. జపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా బాంబు దాడి చేయడంపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ-…