గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈనెల 6వ తేదీన తన ట్విట్టర్ ఖాతాలో అయోధ్య పై పోస్టు చేసిన రాజాసింగ్ పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రాజసింగ్ పై కేసు నమోదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సంజాయిషీ ఇవ్వాలని మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన భారత పర్యటన ఖరారైంది. భారత్- రష్యా దేశాల మధ్య జరిగే 21వ వార్షిక సమావేశంలో భాగంగా వచ్చే నెల 6న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి రానున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ భేటీలో ఆయన ప్రధాని మోదీతో ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలను చర్చించనున్నట్లు తెలిపింది. అలాగే ఇరుదేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు కూడా భేటీ కానున్నట్లు పేర్కొంది. Read Also: కొత్త…