2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huawei Mate X8 Launched: హువావే (Huawei) కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Mate X8ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. బుక్ స్టైల్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్లో 8.2 అంగుళాల ఇన్నర్ డిస్ప్లే, 6.54 అంగుళాల కవర్ స్క్రీన్ ఉన్నాయి. ఇందులో Kirin 9050 Pro Logic Folding Tau చిప్‌సెట్‌ను ఉపయోగించారు. మొత్తం ఐదు కలర్ ఆప్షన్లు, పలు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
ఈ Huawei Mate X8లో 8.2 అంగుళాల OLED ఇన్నర్ డిస్ప్లేను అందించారు. ఇది 2424×2340 పిక్సెల్స్ రిజల్యూషన్, 1-120Hz LTPO రిఫ్రెష్ రేట్, 1440Hz PWM డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్ గరిష్ఠంగా 8,000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. అవసరాన్ని బట్టి బ్రైట్నెస్ను 1 నిట్‌కు కూడా తగ్గించుకోవచ్చు. ఇక 6.54 అంగుళాల కవర్ డిస్ప్లేలో డ్యూయల్ లేయర్ OLED ప్యానెల్, 2444×1132 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉన్నాయి. ఇది 1-120Hz LTPO, HDR Vivid, 1.07 బిలియన్ కలర్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్ గరిష్ఠ బ్రైట్నెస్ 12,000 నిట్స్‌గా ఉంది. ఫోన్‌ను పూర్తిగా తెరిచినప్పుడు మందం కేవలం 4.2 మి.మీ.గా ఉంటుంది.
Also Read
- Motorola Edge 70 Neo 5G: మోటరోలా Edge 70 Neo 5G లాంచ్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే.. ధర ఎంతంటే?
- Red Bra, Blood and Nvidia Flag: చేతిలో బ్రా.. ముఖంపై రక్తపు మరకలు!.. జెన్సన్ హువాంగ్‌పై ట్రంప్ AI పోస్ట్ వైరల్
- Jwala MK-1: శత్రు డ్రోన్లకు ఇక చెక్! భారత్ జ్వాలా MK-1 పరీక్ష సక్సెస్.. ప్రత్యేకతలు ఇవే!
- 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
ఈ ఫోన్లో హువావే ప్రత్యేకమైన మాగ్నెటిక్ ఫ్లాటెనింగ్ హింజ్ సిస్టమ్‌ను ఉపయోగించింది. ఇందులో 0.1 మి.మీ. మాగ్నెటిక్ కాంపోజిట్, ఏరోస్పేస్ గ్రేడ్ స్టీల్ లామినేట్ ఉన్నాయి. ఇంకా ఇందులో Kirin 9050 Pro Logic Folding Tau చిప్‌సెట్‌ను అమర్చారు. ఇదే చిప్‌ను కంపెనీ Mate XT 2లోనూ ఉపయోగిస్తోంది. ఇందులో 9-కోర్, 16-థ్రెడ్ LinxiCore CPU ఉంది. ఇంకా ఇందులో 6,200mAh బ్యాటరీని అందించారు. అలాగే ఇది IP58, IP59 రేటింగ్స్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్‌పై థర్డ్ జనరేషన్ Kunlun Glass, కలెక్టర్ ఎడిషన్‌పై సెకండ్ జనరేషన్ Xuanwu Kunlun Glass రక్షణ కల్పిస్తాయి.
ఈ Mate X8లో Ruiying Z10 మాడ్యులర్ కెమెరా సిస్టమ్‌ను అందించారు. ఇందులో 1 అంగుళం సెన్సార్‌తో కూడిన 50MP RYYB కెమెరా, Red Maple సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నాయి. ఈ కెమెరా మాడ్యూల్తో పాటు కంట్రోల్ హ్యాండిల్, HyperClick కనెక్టర్ షెల్‌తో కూడిన ప్రత్యేక కిట్‌ను కూడా హువావే అందిస్తోంది. మొబైల్ పర్పుల్ గోల్డ్ బ్రోకేడ్, అజ్యూర్ స్కై బ్లాక్, స్నోవీ వైట్, క్వింగ్‌యున్ బ్రోకేడ్, డాన్సియా బ్రోకేడ్ వంటి ఐదు రంగుల్లో లభిస్తుంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి.
* 12GB + 256GB వేరియంట్ CNY 12,999 (సుమారు $1,951).
* 12GB + 512GB వేరియంట్ CNY 13,999 (సుమారు $2,102).
* 16GB + 512GB Collector’s Edition వేరియంట్ CNY 15,999 (సుమారు $2,402).
* 16GB + 1TB Collector’s Edition వేరియంట్ CNY 16,999 (సుమారు $2,552).
* 16GB + 2TB Collector’s Edition వేరియంట్ CNY 20,999 (సుమారు $3,152).
2TB కలెక్టర్ ఎడిషన్ పర్పుల్ గోల్డ్ బ్రోకేడ్, అజ్యూర్ స్కై బ్లాక్ రంగుల్లో మాత్రమే లభిస్తుంది. మొదటి నాలుగు వేరియంట్ల ప్రీ-సేల్స్ చైనాలో నవంబర్ 24న సాయంత్రం 6:08 గంటలకు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 4న ఉదయం 10:08 గంటల నుంచి సాధారణ విక్రయాలు మొదలవుతాయి. 2TB మోడల్ డిసెంబర్ 20న అమ్మకానికి రానుంది. హువావే 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదా సదుపాయంతో పాటు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్పై గరిష్ఠంగా CNY 800 (సుమారు $120) సబ్సిడీని అందిస్తోంది. భారత్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
Motorola Edge 70 Neo 5G: మోటరోలా Edge 70 Neo 5G లాంచ్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే.. ధర ఎంతంటే?
-
Balakrishna: బాలయ్య ఆ దర్శకుడికి ‘నో’ చెప్పాడా?
-
Chiranjeevi: అదేంటి.. చిరు పేరులో ‘N’ లేదు!
-
SP – Congress Alliance: కాంగ్రెస్ ఆశలకు ఎస్పీ బ్రేక్ వేయనుందా..? తెరపైకి 26 సీట్ల ఫార్ములా..!
ట్రెండింగ్
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..