Punjab BJP-SAD Alliance 2027: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. మళ్లీ చేతులు కలిపిన బీజేపీ-అకాలీదళ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab BJP-SAD Alliance 2027: పంజాబ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP), శిరోమణి అకాలీదళ్ (SAD) మరోసారి పొత్తు పెట్టుకున్నాయి. ఈ కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అకాలీదళ్ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తుందని, ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఆ పార్టీకే చెందిన వ్యక్తి ఉంటారని స్పష్టం చేశారు.
2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మరోసారి జతకట్టాయి. ఈ కూటమి ప్రకటన సందర్భంగా అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఎన్డీఏలో అత్యంత పాత మిత్రపక్షమైన అకాలీదళ్ తిరిగి కూటమిలోకి వస్తోందని అమిత్ షా ప్రకటించారు. దాదాపు మూడు నెలల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2027 ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయని తెలిపారు.
Also Read
- SP - Congress Alliance: కాంగ్రెస్ ఆశలకు ఎస్పీ బ్రేక్ వేయనుందా..? తెరపైకి 26 సీట్ల ఫార్ములా..!
- Sonia Gandhi: 'నాన్నను చంపించడానికే భద్రత తొలగించారు'.. రాజీవ్ గాంధీ హత్యపై సోనియా సంచలన వ్యాఖ్యలు!
- PM-KISAN Rules: తండ్రీకొడుకులు ఇద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయి..?
- Legal Notice to Sonia Gandhi: సోనియా గాంధీ పుస్తకంపై మరో వివాదం.. సావర్కర్ మునిమనవడి సంచలన నిర్ణయం!
కూటమిలో అకాలీదళ్ పెద్దన్న పాత్ర పోషిస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. పెద్దన్న పాత్రలో ఉండే పార్టీకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ప్రకటించారు. అయితే ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు కేటాయించాలనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్డీఏ కలిసి పోటీ చేస్తుందని అమిత్ షా వెల్లడించారు. సీట్ల పంపకాలపై రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు.
పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యను పూర్తిగా నిర్మూలించడం తమ ప్రధాన లక్ష్యమని అమిత్ షా ప్రకటించారు. 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను పూర్తిగా నశాముక్త్ రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూడా డ్రగ్స్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాయని, కానీ ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి, గ్యాంగ్‌స్టర్ సంస్కృతి, నేరాలను అరికట్టడం కూడా కూటమి ప్రాధాన్యతలుగా పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన అమిత్ షా.. బీజేపీ, అకాలీదళ్ కలిసి రావడంతో ఆ పార్టీ ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు. సిక్కు సమాజాన్ని అవమానించిన వారిని ప్రజలు అధికారంలో నుంచి దించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
బీజేపీతో మళ్లీ పొత్తు కుదరడంపై అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ ఒప్పందం కాదని, పంజాబ్ ప్రయోజనాల కోసం ఏర్పడిన భావోద్వేగ బంధమని అభివర్ణించారు. పంజాబ్ ప్రజలు కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు మళ్లీ కుదరాలని కోరుకున్నారని అన్నారు. అకాలీదళ్‌కు 106 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉందని, దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి పంజాబ్ అభివృద్ధి వరకు ఆ పార్టీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
గతంలో బీజేపీ, అకాలీదళ్ చాలా కాలం పాటు కలిసి పనిచేశాయి. అయితే 2020లో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై విభేదాల నేపథ్యంలో అకాలీదళ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు 2027 ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీలు మళ్లీ చేతులు కలపడం పంజాబ్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కూటమి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ఎంతవరకు సవాల్ విసురుతుంది? సీట్ల పంపకాలు ఎలా ఉంటాయి? అకాలీదళ్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అవుతారు? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Joint Press conference by BJP National President Shri @NitinNabin, HM Shri @AmitShah and Shiromani Akali Dal President Sardar @officeofssbadal at BJP Headquarters in New Delhi. https://t.co/XNVm2Y7fYs
— BJP (@BJP4India) November 24, 2026
తాజావార్తలు
-
Punjab BJP-SAD Alliance 2027: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. మళ్లీ చేతులు కలిపిన బీజేపీ-అకాలీదళ్!
-
AP Panchayat Elections: ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
-
Sakkshi Mhadolkar: డైలాగులు లేవని ఫ్రెండ్స్ ఏడిపించేవారు.. ‘ఫ్యామిలీ ప్యాక్’తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తా!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
Child Stomach pain: స్కూల్‌కు వెళ్లే ముందు పిల్లలు కడుపునొప్పి అంటున్నారా..? అసలు కారణం ఇదే కావచ్చు!
ట్రెండింగ్
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..