AP Panchayat Elections: ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముగిసిపోగా.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది ఎన్నికల సంఘం.. మూడు దశల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏడీజీపీ మధుసూధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసినట్లు పునేఠా తెలిపారు. అవసరమైన చోట్ల అదనంగా స్ట్రైకింగ్ ఫోర్సెస్‌ను కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఏకగ్రీవాల నేపథ్యంలో కూడా భద్రతా బలగాలను అదనంగా మోహరిస్తున్నట్లు వెల్లడించారు. డీజీపీ కార్యాలయం నుంచి కూడా పోలీసు బలగాలను పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- Vijayawada: వంగవీటి రాధా ప్రమాణ స్వీకారం వేళ కూటమిలో కలకలం.. ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా!
- AP Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పులు.. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఈసీ ఉత్తర్వులు
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. ఫేజ్-IIలో 25 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు
- Adinarayana Reddy: డోంట్ కేర్ మంత్రి పదవి.. మా పిల్లల రాజీనామాలు ఆగవు.. నా రాజీనామా ఢిల్లీలోనే..!
పల్నాడు దిగువ జిల్లాల్లో ఎక్కువ సమస్యలు
పల్నాడు నుంచి దిగువ ప్రాంతాల్లోని జిల్లాల్లో ఎన్నికలకు సంబంధించి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ఎస్ఈసీ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో ఒక అభ్యర్థిని నాలుగుసార్లు అడ్డుకున్న ఘటన తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి అందిన ప్రతి ఫిర్యాదును డీజీపీకి పంపించామని, వాటిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
బలవంతపు ఏకగ్రీవాలకు తావులేదు
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బలవంతంగా ఏకగ్రీవాలు జరగకూడదని స్పష్టంగా ఆదేశించినట్లు అనిల్ చంద్ర పునేఠా చెప్పారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునేలా చూడాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఒత్తిళ్లు, అడ్డంకులు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇక, మొదటి దశ ఎన్నికల్లో 15 నుంచి 20 శాతం వరకు ఏకగ్రీవాలు జరుగుతాయని అంచనా వేసినట్లు ఎస్ఈసీ తెలిపారు. వాస్తవంగా దాదాపు 19 శాతం ఏకగ్రీవాలు జరిగినట్లు వెల్లడించారు. తాము ఆశించిన స్థాయిలో ఏకగ్రీవాలు జరగలేదని పేర్కొన్నారు. మొత్తంగా మూడు దశల గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా..
తాజావార్తలు
-
AP Panchayat Elections: ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
-
Sakkshi Mhadolkar: డైలాగులు లేవని ఫ్రెండ్స్ ఏడిపించేవారు.. ‘ఫ్యామిలీ ప్యాక్’తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తా!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
Child Stomach pain: స్కూల్‌కు వెళ్లే ముందు పిల్లలు కడుపునొప్పి అంటున్నారా..? అసలు కారణం ఇదే కావచ్చు!
-
Motorola Edge 70 Neo 5G: మోటరోలా Edge 70 Neo 5G లాంచ్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..