8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO 16 India Launch: ఐక్యూ (iQOO) కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 16ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక పేజీ అమెజాన్ ఇండియాలో కొద్దిసేపు కనపడింది. ఇందులో Coming Soon అనే ట్యాగ్‌తో పాటు Powered by OriginOS 7 అనే వివరాలు కనిపించాయి. అయితే ప్రస్తుతం ఆ పేజీని తొలగించారు. ఐక్యూ ఇప్పటికే భారత్‌లో ఈ ఫోన్ లాంచ్‌ను ధృవీకరించినప్పటికీ.. కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. సమాచారం ప్రకారం వచ్చే నెలలో ఈ ఫోన్ భారత్‌లో విడుదల కానుంది.
ఈ iQOO 16లో Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్‌సెట్‌ను అందించనున్నారు. 2nm టెక్నాలజీతో రూపొందించిన ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 5.01GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. చైనాలో సెప్టెంబర్‌లో విడుదలైన మోడల్లోనూ ఇదే ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గ్లోబల్ వేరియంట్ గీక్‌బెంచ్‌లో 12GB RAM, Android 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కనిపించింది.
Also Read
- Dell XPS 16 Creator Edition: భారత్‌లో డెల్ XPS 16 Creator Edition లాంచ్.. 3.2K OLED డిస్ప్లే, NVIDIA RTX Spark చిప్
- PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
- రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..
- 12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
చైనా వేరియంట్లో 6.85 అంగుళాల 2K AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే భారీ 8,400mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. వెనుకవైపు మూడు 50MP కెమెరాలతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. చైనాలో 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 5,999గా ఉంది. భారత మార్కెట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
మరోవైపు iQOO 16R పేరుతో భావిస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్ కూడా గీక్‌బెంచ్‌లో కనిపించింది. vivo I2606 మోడల్ నంబర్‌తో గుర్తించిన ఈ డివైజ్‌లో Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో ఎనిమిది కోర్లు ఉండగా, గరిష్ఠంగా 3.21GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. Adreno 825 GPU కూడా ఉంది. గీక్‌బెంచ్‌లో ఈ ఫోన్ 12GB RAM, Android 17తో కనిపించింది. సింగిల్ కోర్ టెస్ట్‌లో 1,775 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్‌లో 6,680 పాయింట్లు సాధించింది. అయితే ఈ ఫోన్ పేరును ఐక్యూ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఇదే మోడల్ నంబర్ గతంలో IMEI డేటాబేస్‌లో iQOO 16R పేరుతో కనిపించగా, మలేషియా SIRIM, ఇండోనేషియా SDPPI సర్టిఫికేషన్లలో iQOO 16s పేరుతో నమోదైంది. అలాగే భారత్‌లో BIS సర్టిఫికేషన్ కూడా పొందింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. రెండో టెస్టుకు స్టార్ పేసర్ దూరం!
-
Dell XPS 16 Creator Edition: భారత్‌లో డెల్ XPS 16 Creator Edition లాంచ్.. 3.2K OLED డిస్ప్లే, NVIDIA RTX Spark చిప్
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
ట్రెండింగ్
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్‌ఫోన్‌తో గేమింగ్ సందడి..!
-
రూ.399కే అన్లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్..! Jio Happy New Year 2027 ఆఫర్ లాంచ్..
-
12,000 నిట్స్ బ్రైట్నెస్, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. డిసెంబర్ 9న Motorola Signature 27 లాంచ్..!
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!