Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య కీలక పరిణామం.. ఇరు పక్షాల యుద్ధ ఖైదీల విడుదల
- రష్యా-ఉక్రెయిన్ మధ్య కీలక పరిణామం
- ఇరు పక్షాల యుద్ధ ఖైదీల విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య గత నాలుగేళ్ల నుంచి భీకర యుద్ధం సాగుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక శాంతి చర్చలు ప్రారంభించారు. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. మరోసారి ఇస్తాంబుల్ వేదికగా శాంతి చర్చలకు సిద్ధపడుతుండగా అకస్మాత్తుగా ఉక్రెయిన్.. రష్యాపై డ్రోన్ దాడులు చేసింది. దీంతో రష్యా వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి: Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?
Also Read
ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సరికొత్త వాతావరణం నెలకొంది. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చర్చల్లో కీలక పురోగతి లభించింది. శాంతి చర్చలు ఫలించడంతో 25 ఏళ్లలోపు రష్యా-ఉక్రెయిన్‌కు చెందిన ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. దీంతో యుద్ధ ఖైదీల ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. వీళ్లంతా యుద్ధం ప్రారంభం నుంచి ఉన్న ఖైదీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక రహస్య ప్రదేశంలో ఈ ఖైదీల మార్పిడి జరిగినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Musk: ట్రంప్‌తో గొడవపై మస్క్ క్షమాపణ.. పోస్టులపై విచారం
ఖైదీల విడుదలకు సంబంధించిన వీడియోను రష్యా రక్షణ శాఖ పోస్టు చేసింది. ప్రస్తుతం బెలారస్‌లో వైద్యం అందిస్తున్నట్లు తెలిపింది. తర్వాత మాస్కోలోని ఆస్పత్రులకు తరలిస్తామని వెల్లడించింది. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా యుద్ధ ఖైదీల మార్పిడిని ధ్రువీకరించారు. ఇస్తాంబుల్‌లో జరిగిన రెండో దశ చర్చల్లో బందీలను మార్చుకునేందుకు ఇరువర్గాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఓ వైపు చర్చలు కొనసాగుతుండగానే రష్యా ఇంకోవైపు ఉక్రెయిన్‌పై డ్రోన్ దాడులు చేస్తూనే ఉంది. మంగళవారం కీవ్‌పై దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా.. 13 మంది గాయపడ్డారు. గత మూడేళ్ల యుద్ధంలో రష్యా జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని జెలెన్‌స్కీ వెల్లడించారు. ఇక ఉక్రెయిన్ కూడా ఇటీవల స్పైడర్ వెబ్ పేరుతో రష్యాపై భీకర దాడులు చేశారు.
తాజావార్తలు
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!