United Nations: రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పలు సంస్థలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని ఎఫెక్ట్, తాజాగా ఐక్యరాజ్యసమితి పైనా పడింది. పలు సంక్షోభ ప్రాంతాల్లో ఉన్న తమ శాంతి పరిరక్షకులను కుదించి తిరిగి వెనక్కి రప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ యెమెన్‌లో గల సనాలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా వైమానిక బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించాగా.. పలువురికి గాయాలు అయ్యాయి.
రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడిలో అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం బాధకరం అని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో దాడి చేసి తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటించారు.
రఫాలో ఇజ్రాయెల్ దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 45 మంది సామాన్య పౌరుల ప్రాణాలను బలిగొన్న ఈ ఘటనపై విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇండోనేషియాలో ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా భారత్‌కు చెందిన గీతా సబర్వాల్‌ను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ నియమించారు. సోమవారం తన పదవిని చేపట్టిన సభర్వాల్.. వాతావరణ పరివర్తన, స్థిరమైన శాంతి, పాలన, సామాజిక విధానానికి మద్దతు ఇచ్చే అభివృద్ధిలో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు.
భారత్ విశ్వ దేశమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పేర్కొన్నారు. బహుపాక్షిక వ్యవస్థలో భారత్ ముఖ్యమైన భాగస్వామి ఆయన వెల్లడించారు. ఐరాస భద్రతా మండలిలో సభ్యత్వంపైనా ఆయన స్పందించారు.
డిసెంబర్ నెలలో 15 దేశాల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భ్రమణ అధ్యక్ష పదవిని భారతదేశం గురువారం స్వీకరించింది. ఈ సమయంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పలు ఈవెంట్‌లను భారత్ నిర్వహించనుంది.
వాతావరణ మార్పులపై పోరాటంలో అత్యంత ముఖ్యమైన అంశం ఐక్యత అని గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో గురువారం జరిగిన 'మిషన్ లైఫ్' గ్లోబల్ లాంచ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో కలిసి గురువారం ఏక్తా నగర్‌లో 'మిషన్ లైఫ్' ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్ అరుదైన ఘనత సాధించారు. ఐక్యరాజ్యసమితిశాశ్వత ప్రతినిధిగా సీనియర్ భారత రాయబారి 1987 ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారిణి రుచిరా కాంబోజ్ బాధ్యతలను స్వీకరించారు.