Silvio Berlusconi: సాధారణంగా కుటుంబ పెద్దలు తమ వారసులకు ఆస్థిలో వాటా ఇస్తుంటారు. వారసులు కాకుండా తమ బంధువుల్లో ఎవరికైనా కూడా ఆస్థిలో వాటా ఇస్తుంటారు. కానీ తమ ప్రియురాలుకి .. ప్రియుడికి ఆస్థిలో వాటాలు ఇవ్వడం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఘటనే ఇదే… ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని తన ఆస్థిలో రూ. 906 కోట్లను తన ప్రియురాలి పేరుతో రాశారు. సిల్వియో బెర్లుస్కోని గత నెలలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. లుకేమియాతో బాధపడుతున్న 86 ఏళ్ల బెర్లుస్కోని.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు గురై ప్రాణాలు విడిచారు. బెర్లుస్కోనికి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
గత కొన్నాళ్లుగా మార్తా ఫాసినా అనే 33 ఏళ్ల మహిళతో బెర్లుస్కోని ప్రేమాయణం సాగిస్తున్నారు. ఇద్దరి మధ్య 53 ఏళ్ల వయోభేదం ఉన్నప్పటికీ.. వారి ప్రేమకు వయసు అడ్డురాలేదు. ఈ నేపథ్యంలో తన మది దోచిన ప్రియురాలు ఫాసినా పేరిట రూ.906 కోట్ల ఆస్తిని బెర్లుస్కోని రాశారని, ఈ మేరకు తన వీలునామాలో పేర్కొన్నారని ఒక పత్రిక కథనం పేర్కొంది.
Read also: MLA Prasanna Kumar: పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై ఆరోపణలు చేయడం సరికాదు
ఇటలీ ధనవంతుల్లో ఒకరైన బెర్లుస్కోని మొత్తం సంపద విలువ రూ.4.6 లక్షల కోట్లు. అందులో రూ.900 కోట్లు పెద్ద విషయమేమీ కాకపోయినప్పటికీ.. మాజీ ప్రధానితో డేటింగ్ చేసిన ఫాసినాకు ఇది ఊహించని అదృష్టమే. మార్తా ఫాసినా కూడా రాజకీయ నాయకురాలే. ఇటలీ పార్లమెంట్ దిగువ సభ చాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో ఆమె 2018 నుంచి సభ్యురాలిగా కొనసాగుతున్నారు. బెర్లుస్కోనీ, ఫాసినాలు మార్చి 2020 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆమెను చట్టబద్ధంగా మాజీ ప్రధాని వివాహం చేసుకోకపోయినా.. మరణశయ్యపై ఉన్నప్పుడు ఫాసినాను తన భార్యగానే చెప్పుకున్నారు. బెర్లుస్కోనీ స్థాపించిన ఫోర్జా ఇటాలియా పార్టీలో మార్తా ఫాసినా సభ్యురాలు కూడా. బెర్లుస్కోని వ్యాపార సామ్రాజ్యాన్ని అతని పెద్ద కుమార్తె మెరీనా, కుమారుడు పియర్ సిల్వియోలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ హోదా కలిగిన వీరికి ఫిన్‌ఇన్వెస్ట్ ఫ్యామిలీ హోల్డింగ్‌లో 53 శాతం వాటా ఉంటుంది. తన సోదరుడు పాలోకు 100 మిలియన్ యూరోలు, ఫోర్జా ఇటాలియా పార్టీకి చెందిన మాజీ సెనేటర్ మార్సెల్లో డెల్ ఉట్రీకి 30 మిలియన్ యూరోలను ఇటలీ మాజీ ప్రధాని పంచిపెట్టారు. ఇటలీ మీడియా మొఘల్‌గా, వ్యాపారవేత్తగా, ప్రధానిగా దశాబ్దాల పాటు బెర్లుస్కొని ప్రస్థానం కొనసాగింది. గత నెల 12న మిలాన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Read also: Nuveksha: బ్లాక్ సారీలో బ్యాక్ అందాలు చూపిస్తూ చూపులతో గిల్లుతున్న నువేక్ష..
మాజీ ప్రధాని వీలునామాను గత మంగళవారం ఆయన ఐదుగురు పిల్లల సమక్షంలో తెరిచారు. తాను స్టాక్‌ను పిల్లలు మెరీనా, పియర్ సిల్వియోలకు సమాన భాగాలుగా పంచుతున్నానని… మిగిలిన తన ఆస్తిని ఐదుగురు పిల్లలు మెరీనా, పియర్ సిల్వియో, బార్బరా, ఎలియోనోరా, లుయిగికి సమాన భాగాలుగా చేసుకోవాలి.. మీ నాన్న పట్ల మీరు చాలా ప్రేమను చూపించినందుకు ధన్యవాదాలు అని వీలునామా ముగించారు. సొంతంగా పార్టీని ఏర్పాటుచేసి 1984లో రాజకీయాల్లోకి వచ్చిన బెర్లుస్కోని.. ఇటలీకి మూడుసార్లు ప్రధానిగా ఉన్నారు. ఇటలీని ఎక్కువకాలం పాలించిన ప్రధానిగా గుర్తింపు పొందిన బెర్లుస్కోని.. అనేక కుంభకోణాల్లో ఇరుక్కున్న మొదటి పాలకుడిగానూ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. పన్నుల చెల్లింపులో అక్రమాలకు పాల్పడినట్టు రుజుకావడంతో ఆరేళ్ల పాటు రాజకీయాల్లో నిషేధానికి గురయ్యారు. ఆయన లుకేమియాతో బాధపడుతున్నప్పటికీ సెనేటర్‌గా, ప్రధాని జార్జియా మెలోనీ మితవాద ప్రభుత్వంలో భాగస్వామిగా చివరి వరకు రాజకీయాల్లో కొనసాగారు.