Asteroid: 120 అడుగుల గ్రహశకలం భూమికి దగ్గరగా వస్తుందని నాసా అధికారులు గురువారం ధ్రువీకరించారు. అయితే, దీని వల్ల భూమికి, జీవజాలానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది.
Asteroid Coming Near Earth: ప్రతి వారం కొన్ని గ్రహశకలాలు భూమి వైపు వస్తూనే ఉంటాయి. ఈ నెల ప్రారంభం నుంచి అనేక గ్రహశకలాలు భూమికి సమీపంలోకి వచ్చి వెళ్లాయి. ఈ గ్రహశకలాలు భూమిని ఢీకొనే ప్రమాదం ఉంది.
గోళ అద్భుతాలను చూసేందుకు అందరూ ఇష్టపడతారు. కానీ గ్రహశకలాలు భూమి దగ్గరగా వెళ్లినా, పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు అందదు. అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా అఫోసిస్ అనే గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. దీని పరిమాణం 370 మీటర్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Asteroid: సౌరకుటుంబంలో కొన్ని ఏళ్లకు ఒకసారి భూమికి దగ్గర కొన్ని గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్) వస్తుంటాయి. అయితే, వీటిలో కొన్ని భూమిని ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంది. ఎప్పటికప్పుడు ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థలు వీటిపై నిఘా వేసి ఉంచుతాయి. ఇదిలా ఉంటే, తాజాగా ప్రమాదకరమైన ఒక గ్రహ శకలం భూమి వైపు వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది.
NASA: సౌరకుటుంబంలో అనేక గ్రహశకలాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. చాలా వరకు గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోనే ఉంటాయి. కొన్ని సార్లు మాత్రం వీటి నుంచి బయటపడి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. అయితే అలాంటి ఓ గ్రహ శకలాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది. అయితే తాజాగా కనుగొన్న గ్రహశకలం మాత్రం విచిత్రమైన ఆకారంలో ఉంది. ఓ పెద్ద భవనం మాదిరిగా ఉంది. దీని పొడవు 1600 అడుగులు కాగా.. వెడల్పు 500 అడుగులు ఉన్నట్లు,…
Asteroid: అంతరిక్షంలో ప్రతిరోజూ శాస్త్రవేత్తలు కొత్త వాటిని గుర్తిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే తాజాగా ఓ ఆస్టరాయిడ్ భూమివైపు వేగంగా దూసుకొస్తుందని కనుగొన్నారు.
Nasa Mission Success: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. భవిష్యత్‌లో భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించేందుకు నాసా ఈ ప్రయోగం చేపట్టింది. ఈ మేరకు డైమార్ఫస్ గ్రహశకలాన్ని నాసా అంతరిక్ష నౌక ఢీకొట్టింది. సుమారు రూ.2500 కోట్ల విలువైన ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్’ (డీఏఆర్‌టీ) స్పేస్‌క్రాఫ్ట్ గంటకు 22,50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ గ్రహశకలాన్ని ఢీకొట్టినట్లు నాసా సైంటిస్టులు వివరించారు. 10…
అంతరిక్షంలో తరచూ కొన్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.. కొన్ని గ్రహశకలాలు భూమిపైకి దూసుకొస్తాయి.. కొన్ని సార్లు ప్రమాదం జరిగినా.. చాలా సార్లు ప్రమాదాలు తప్పాయి.. అయితే, అంతరిక్షం నుంచి మరో ప్రమాదం రాబోతోంది.. ఒక గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. ఈ గ్రహశకలం 450 మీటర్ల వెడల్పు ఉందని చెప్పింది. మిగతా గ్రహశకలాలతో పోలిస్తే దీని సైజు అంత భయపడాల్సినది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇది ప్రయాణించే…