Donald Trump: ప్రధాని మోడీ సరైనది చేస్తారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- వలసల విషయంలో ప్రధాని మోడీ సరైనదే చేస్తారు..
- డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయులను తీసుకునేందుకు మన దేశం అంగీకరించింది. అమెరికాలోకి అక్రమంగా వచ్చిన భారతీయ వలసదారుల విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ‘‘సరైనది చేస్తారు’’ అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీ, ట్రంప్ సోమవారం ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి, ప్రపంచ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు.
ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నుంచి అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. చాలా మందిని వారివారి దేశాలకు బహిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 18,000 మంది భారతీయులను యూఎస్ అధికారులు గుర్తించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. గత వారం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయని సందర్భంలో కూడా క్రమ రహిత వలసల సమస్యను పరిష్కరించాలనే కోరికను నొక్కి చెప్పారు. భారతీయులను తీసుకోవడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని జైశంకర్ హామీ ఇచ్చారు.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
Read Also: Supreme Court: ముస్లిం మహిళ “లౌకిక ఆస్తి చట్టాలను” కోరుతోంది.. మీ సమాధానం ఏంటి..?
‘‘ఒక ప్రభుత్వంగా చట్టబద్ధమైన వలసలకు మా మద్దతు ఉంటుంది. భారతీయుల ప్రతిభ, భారతీయు నైపుణ్యాలు ప్రపంచ స్థాయిలో గరిష్ట అవకాశాలను కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము. అదే సమయంలో అక్రమ వలసలను కూడా మేము గట్టిగా వ్యతిరేకిస్తాము’’ అని జైశంకర్ వాషింగ్టన్‌లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘ఏదైనా చట్టవిరుద్ధమైనవి జరిగినప్పుడు, అనేక ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలతో కలిసిపోతామని మీకు తెలుసు. మన పౌరులు ఎవరైనా చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్నారని ఖచ్చితంగా తెలిస్తే, వారిని భారత్ తీసుకురావడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటాము’’ అని చెప్పారు.
ఇదిలా ఉంటే, నైపుణ్యం కలిగిన వర్కర్ల చట్టబద్ధమైన వలసలకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పలు సందర్భాల్లో చెప్పారు. ఇది మన ఐటీ నిపుణులకు చాలా ఉపయోగంగా మారుతుంది. భారతదేశ టెక్కీలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. యూఎస్ జారీ చేసే H-1B వీసాలలో ఎక్కువ భాగం మన దేశానికి చెందినవారికే వస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!