Supreme Court: ముస్లిం మహిళ “లౌకిక ఆస్తి చట్టాలను” కోరుతోంది.. మీ సమాధానం ఏంటి..?
- ఆస్తి విషయంలో లౌకిక చట్టాలను కోరిన ముస్లిం మహిళ..
- కేంద్రం సమాధానం కోరిన సుప్రీంకోర్టు..
- యూసీసీ చర్చ సమయంలో కీలకమైన కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(సీఏఏ)పై చర్చ జరుగుతున్న సందర్భంలో, సుప్రీంకోర్టులోకి కీలక కేసు వచ్చింది. ఒకవేళ ఒక వ్యక్తి ముస్లిం కుటుంబంలో జన్మిస్తే అతనున ఆస్తి విషయంలో లౌకిక చట్టాలు పాటించవచ్చా.? లేదా షరియా, ముస్లిం వ్యక్తిగత చట్టాలు పాటించవచ్చా..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. దీనిపైన కేంద్ర సమాధానాన్ని సుప్రీంకోర్టు కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాల సమయంలో కేంద్రం తన సమాధానాన్ని తెలపాలని కోరింది. తదుపరి విచారణను మే 5కి వాయిదా వేసింది.
ఈ కేసులో పిటిషన్ కేరళకు చెందిన సఫియా పీఎం. ఆమె తన మొత్తం ఆస్తిని తన కుమార్తెకు ఇవ్వాలని అనుకుంటోంది. ఆమె కొడుకు ఆటిజంతో బాధపడుతున్నాడు. ఆమె కుమార్తె అతడిని చూసుకుంటుందని పిటిషన్‌లో పేర్కొంది. షరియా ప్రకారం.. తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకు, కుమార్తె కన్నా రెండు రెట్ల ఆస్తిని పొందుతాడు. తన కుమారు డౌన్ సిండ్రోమ్ కారనంగా మరణిస్తే, తన కుమార్తెకు ఆస్తిలో కేవలం మూడింట ఒక వంతు మాత్రమే పొందుతుందని, మిగతాది బంధువులకు వెళ్తుందని పిటిషనర్ చెప్పారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
Read Also: Rythu Maha Dharna: నల్లగొండలో ముగిసిన రైతు మహాధర్నా.. భారీగా తరలివచ్చిన జనం
తాను, తన భర్త ఇస్లాంను ఆచరించడం లేదని, కాబట్టి తమకు భారత వారసత్వం చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం ఆస్తిని పంపిణీ చేయడానికి అనుమతించాలని సఫియా తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం భారత వారసత్వ చట్టాలు ముస్లింలకు వర్తించవు. ఇప్పుడు సఫియా వీటిని సవాల్ చేశారు. దీనిని ఆసక్తికరమైన కేసుగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.
మతంతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికి ఉమ్మడి పౌర చట్టాలతో కూడిన యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు కీలకంగా మారింది. క్రిమినల్ చట్టాలు అందరికి సమానంగా ఉన్నప్పటికీ, ఆస్తి వారసత్వం, దత్తత, చట్టాలు కొన్ని వర్గాలకు విభిన్నంగా ఉన్నాయి. యూనిఫాం సివిల్ కోడ్ తమ మత స్వేచ్ఛని అడ్డుకుంటుందని కొన్ని వర్గాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్ సర్కార్ యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!