ఒక్కోసారి అద్భుతాలు జరుగుతుంటాయి. రోడ్డుమీద వెళుతున్న బస్సు డ్రైవర్ కి హార్ట్ ఎటాక్ వస్తుంది. అతనే ఎలాగోలా బస్ ని అదుపు చేస్తుంటాడు. అదే ఆకాశంలో అయితే ఊహించుకుంటేనే భయంగా వుంది కదూ. అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన అందరికీ ముచ్చెమటలు పట్టించింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే స్పృహ కోల్పోయాడు పైలట్. కాక్‌పిట్‌లోని రేడియో ద్వారా సాయం కోసం అర్థించాడో ప్రయాణికుడు. అతడితో మాట్లాడుతూ విమానాన్ని చాకచక్యంగా ల్యాండ్ చేయించారు ఎయిర్ ట్రాఫిక్ అధికారులు.
డ్రైవింగ్ అంటే ఈ రోజుల్లో దాదాపు అందరూ నేర్చుకుంటున్నారు. కానీ పైలట్ కావడం అంత ఈజీ కాదు. ఆకాశంలో ప్రయాణించే విమానంలో వుండే ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు పైలట్ చేతిలోనే వుంటాయి. విమానాన్ని నడపడంలో ఏమాత్రం అనుభవం లేని ఓ ప్రయాణికుడు దానిని సేఫ్ ల్యాండింగ్ చేసి ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఓ తేలికపాటి చిన్న సైజు విమానం టేకాఫ్ అయింది. అది అలా గాల్లోకి లేచిందో, లేదో పైలట్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పైలట్ స్పృహ కోల్పోవడంతో భయభ్రాంతులకు గురైన అందులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
కానీ కాక్‌పిట్‌లోని రేడియో ద్వారా ఓ ప్రయాణికుడు అధికారుల సాయం కోరడం, వారు వెంటనే అతడికి సాయం చేశారు. ఫోర్ట్ పీర్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే స్పందించి ప్రయాణికుడితో మాట్లాడారు. సెస్నా 280 పొజిషన్ గురించి తెలుసా? అని ప్రశ్నించాడు. తనకు తెలియదని ప్రయాణికుడు చెప్పాడు. భయపడవద్దంటూ విమానాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పించారు. ఆ తర్వాత విమానం సరిగ్గా ఎక్కడుందో గుర్తించారు. బోకా రేటన్ నుంచి ఫ్లోరిడా ఉత్తర తీరం వైపుగా అది వెళ్తుందని తెలుసుకుని, అతడి ఫోన్ కి ఫోన్ చేసి అతడికి డైరెక్షన్స్ ఇచ్చారు. అంతే అధికారులు ప్రయాణికుడి సాయంతో అతడికి సూచనలు చేస్తూ సేఫ్ గా ల్యాండింగ్ చేయించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న సహాయక సిబ్బంది స్పృహ కోల్పోయిన పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుడి ధైర్యానికి అధికారులు సలాం చేశారు.
Andhra Pradesh: ఏపీలో తగ్గిపోయిన సంతానోత్పత్తి.. కారణం ఏంటి?