Andhra Pradesh: ఏపీలో తగ్గిపోయిన సంతానోత్పత్తి.. కారణం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో ప్రతి దంపతులు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలను కనేవాళ్లు. కానీ కొన్నేళ్ల నుంచి దంపతుల ఆలోచన విధానం మార్పులు వచ్చాయి. కేవలం ఇద్దరు లేదా ముగ్గురు చాలు అనుకుంటున్నారు. కొందరు అయితే ఒకరితోనే సరిపెట్టేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కుటుంబాల్లో పిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అయితే ఏపీలో కుటుంబ నియంత్రణ పాటిస్తున్న వారి సంఖ్య మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. ఈ విషయం జాతీయ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ఏపీలో సగటున ప్రతి 10 కుటుంబాలకు 17 మందే పిల్లలు మాత్రమే ఉంటున్నారు.
జాతీయ ఆరోగ్య సర్వే ప్రకారం ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.7గా నమోదైంది. ఇది 2015-16లో 2.2గా ఉండేది. జనాభా నియంత్రణకు గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పథకాలు అమలు చేస్తోంది. సంతానం తగ్గించేందుకు ముందుకొచ్చే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించింది. దీంతో 1992 నుంచి 1999 వరకు విస్తృత స్థాయిలో జరిగిన ప్రచారం వల్ల కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీని వల్ల సంతానం సంఖ్య క్రమంగా తగ్గింది. పేద కుటుంబాల్లో పిల్లల పోషణ భారం కావడం కూడా సంతానోత్పత్తి తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది.
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
మరోవైపు దేశ వ్యాప్తంగా కూడా ఫెర్టిలిటీ రేటు దారుణంగా పడిపోయింది. దేశంలో ఫెర్టిలిటీ రేటు 2.2 నుంచి 2.0కు తగ్గిపోయినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తన నివేదికలో స్పష్టం చేసింది. దేశంలో కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఫెర్టిలిటీ రేటు 2 కంటే ఎక్కువగా నమోదైంది. బీహార్ (2.98), మేఘాలయా(2.91), ఉత్తరప్రదేశ్(2.35), జార్ఖండ్(2.26), మణిపూర్(2.17) రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
అయితే దేశంలో జనాభా పరిమితి ఇంతకుమించి తగ్గకుండా చూడటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే యువత సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ నియంత్రణ చర్యలవల్ల 35 నుంచి 40 సంవత్సరాల వయసువారు తగ్గుతూ వస్తున్నారు. ఈ వయసువారు తగ్గడంతో పిల్లల సంఖ్య నానాటికీ తగ్గిపోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?