Australian Beach Mystery: ఆస్ట్రేలియా ఒడ్డున భారత్ PSLV రాకెట్ భాగం.. ప్రకటించిన ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australian Beach Mystery: ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు భారత్‌కు చెందిన పీఎస్‌ఎల్‌వీ కి చెందిన శకలంగా ఆస్ర్టేలియా స్పేస్ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పరీక్షలను నిర్వహించిన అనంతరం స్పేస్ అధికారులు ప్రకటించారు. ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు మిస్టరీ వీడింది. అది భారత్‌కు చెందిన రాకెట్‌దేనని అక్కడి అధికారులు ప్రకటించారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణంలో ఉన్న జురియన్ బే సమీపంలో జులై మధ్యవారంలో ఈ వస్తువు తొలిసారిగా కనిపించింది. ఆరు ఫీట్ల ఎత్తు.. కేబుల్స్ వేలాడుతూ కనిపించింది. ఆ సమయంలో ఇది చంద్రయాన్-3కి చెందిన శకలం అంటూ ప్రచారాలు చేశారు. ఇంకొందరు తొమ్మిదేళ్ల కిందట అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ MH 370 విమానందేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ దానిని అధ్యయనం చేసి సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది.
Read also: Nee Jathai Song: ఏజెంట్ బ్యూటీతో మెగా ప్రిన్స్ రొమాన్స్
Also Read
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికిల్(PSLV)కి చెందిన శకలమని ఆస్ర్టేలియా స్పేస్ అధికారులు ప్రకటించారు. అయితే.. దీనిపై అధికారికంగా అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోకి లోబడి ఇరు దేశాలు సంయుక్త ప్రకటన వెలువరించాల్సి ఉందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. తాము పరిశీలించిన తర్వాతే ప్రకటన చేస్తామని ఇస్రో ఇదివరకే ప్రకటించగా.. అది ఎప్పటిది అనే దానిపై ఇస్రో అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. PSLV ప్రయోగ దశల్లో ఇలా శలాలను సముద్రంలో పడేయడం సర్వ సాధారణంగా జరిగేదే. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా తీరానికి ఇలాంటి స్పేస్ జంక్ కొట్టుకురావడం ఇదే తొలిసారి కాదు. గత ఆగష్టులో ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ రాకెట్ శకలం న్యూసౌత్‌వేల్స్‌లోని ఓ గడ్డి మైదానంలో
పడగా.. ఓ గొర్రెల కాపరి దానిని గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు. ఆ తరువాత అధికారులు పరీక్షలు నిర్వహించి అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు కూడా అలాగే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
తాజావార్తలు
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!