Gandeevadhari Arjuna First Single Out Now: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాంఢీవధారి అర్జున’ ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25న భారీ రేంజ్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఇక రీసెంట్‌గా ‘గాంఢీవధారి అర్జున’ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేయగా ఈ సినిమా మీద అంచనాలను రెట్టింపు చేసింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘నీ జతై…’ అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. వరుణ్ తేజ్, సాక్షి వైద్యల మధ్య సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. మిక్కీ జె.మేయర్ సంగీత సారథ్యంలో వస్తోన్న ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంలో నీ జతై.. మెలోడీ సాంగ్‌ను ఎల్వ్యా, నకుల్ అభయంకర్ పాడగా పాట అయితే వినసొంపుగా ఉంది.
Spark L.I.F.E: పాన్ ఇండియా లెవల్లో ‘స్పార్క్L.I.F.E’.. ఆగస్ట్ 2న టీజర్
సరికొత్త యాక్షన్ సీక్వెన్సులతో ఇన్‌టెన్స్ యూనిక్ స్టోరీ లైన్‌తో సినిమా అందరినీ మెప్పించడానికి సిద్ధమవుతోన్న ‘గాంఢీవధారి అర్జునలో వరుణ్ తేజ్‌తో పాటు సాక్షి వైద్య కూడా స్పెషల్ ఏజెంట్‌గా కనిపించనుంది. సీనియర్ నటుడు నాజర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయని, ఇప్పటి వరకు చూడని సరికొత్త లుక్‌లో వరుణ్ తేజ్ కనిపించబోతున్నారని చెవుతున్నారు. వరుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా యూరోపియన్ దేశాలతో పాటు యు.ఎస్.ఎలోనూ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఎస్వీసీసీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.