Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
- కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య
- 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
- డిసెంబర్లో హిమాంశి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడాలోని టొరంటో నగరంలో భారత సంతతికి చెందిన యువతి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 30 ఏళ్ల హిమాంశి ఖురానా హత్య కేసులో ఆమెతో సన్నిహిత సంబంధం ఉన్న 32 ఏళ్ల వ్యక్తిని కెనడా పోలీసులు ఏడు నెలల తర్వాత అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రకారం నిందితుడిని అబ్దుల్ ఘఫూరిగా గుర్తించారు. హిమాంశి ఖురానా హత్య అనంతరం అతడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
డిసెంబర్లో హిమాంశి మృతి
పోలీసుల వివరాల ప్రకారం.. హిమాంశి ఖురానా టొరంటోలోని Strachan Avenue, Wellington Street West ప్రాంతంలో కనిపించకుండా పోయారు. దీంతో పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డిసెంబర్ 20న ఉదయం సుమారు 6:30 గంటలకు ఓ నివాసంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనను టొరంటోలో 2025లో నమోదైన 40వ హత్య కేసుగా పోలీసులు పేర్కొన్నారు. హిమాంశి, అబ్దుల్ ఘఫూరి ఇద్దరూ సన్నిహిత భాగస్వామ్య సంబంధంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
ఏడు నెలల తర్వాత అరెస్ట్
హిమాంశి మృతి తర్వాత పోలీసులు ఈ కేసుపై విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఆచూకీ కోసం అతని ఫొటోలు, వీడియోలను కూడా విడుదల చేశారు. దాదాపు ఏడు నెలల అనంతరం.. 2026 ఆగస్టు 7న అబ్దుల్ ఘఫూరిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతనిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్ (First-Degree Murder) అభియోగం నమోదు చేసినట్లు టొరంటో పోలీసులు తెలిపారు. టొరంటో పోలీస్ సర్వీస్ ప్రకారం.. ఫ్యూజిటివ్ స్క్వాడ్, హోమిసైడ్ అండ్ మిస్సింగ్ పర్సన్స్ యూనిట్ అధికారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోలీసు సంస్థలతో కలిసి పనిచేసి నిందితుడిని కెనడాకు తిరిగి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.
భారత కాన్సులేట్ సంతాపం
హిమాంశి ఖురానా హత్యపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆమెను యువ భారతీయురాలిగా పేర్కొంటూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు కాన్సులేట్ వెల్లడించింది. హిమాంశి మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి కూడా అవసరమైన చర్యలు చేపట్టినట్లు కాన్సులేట్ తెలిపింది.
కేసులో దర్యాప్తు కొనసాగింపు
ఏడు నెలల పాటు కొనసాగిన దర్యాప్తు అనంతరం నిందితుడి అరెస్ట్ ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. ప్రస్తుతం అబ్దుల్ ఘఫూరిపై ఫస్ట్-డిగ్రీ హత్య అభియోగాలు నమోదయ్యాయి. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి కదలికలు వంటి అంశాలపై కెనడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Balakrishna: మోక్షజ్ఞ మూవీలో బాలయ్య రోల్ అంతేనా?
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!