Pakistan : ప్రపంచంలో ఏ మూలన కూడా ఏ వయసులో ఉన్న అమ్మాయిలు సురక్షితంగా లేరనేది నగ్నసత్యం. ప్రతిరోజూ అనేక ప్రాంతాల నుండి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Pakistan: పాకిస్తాన్ లో అరాచకం రాజ్యమేలుతోంది. అక్కడ ఆర్థిక సంక్షోభం ప్రజలను తీవ్ర పేదరికంలోకి నెట్టేస్తోంది. ఇక రాజకీయంగా అస్థిరత నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వార్త ఒళ్లుగగుర్పాటుకు గురిచేస్తోంది. పాకిస్తాన్ లోని తల్లిదండ్రులు తమ కూతుళ్ల సమాధులకు తాళాలు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. చనిపోయిన కూతుళ్ల శవాలపై అత్యాచారాలకు ఒడిగట్టకుండా తల్లిదండ్రులు సమాధులకు తాళాలు వేస్తున్నారని డైలీ టైమ్స్ వెల్లడించింది. దేశంలో ‘‘నెక్రోఫిలియా’’ కేసులు పెరుగుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది.