Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తు్ంఖ్వాల్లోని వేర్పాటువాద ఉద్యమాలు, ఇంకో వైపు ఉగ్రవాది ఇలా అన్ని వైపుల నుంచి కూరుకుపోతోంది. ద్రవ్యోల్భణం తీవ్రంగా ఉండటంతో అక్కడి ప్రజలకు నిత్యావసరాలు అందని ద్రాక్షగా మిగులుతున్నాయి. బయటకి పాక్ ఆర్మీ ప్రపంచంలోనే శక్తివంతమైనదిగా అక్కడి ప్రజలు, సైనికాధికారులు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం ఆ దేశం కనీసం F-16 యుద్ధవిమానాలను గాలిలోకి ఎగరేసేందుకు కూడా ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. యుద్ధవిమానాలు నడపాలంటే ఇంధనం కావాలి, దాని స్పేర్ పార్ట్స్‌కి డబ్బులు కావాలి, ఈ రెండింటిని కూడా పాకిస్తాన్ కొనలేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫలితంగా దాని యుద్ధవిమానాలు నేలకే పరిమితమవుతున్నాయి.
తన రక్షణ సామర్థ్యానికి కీలమైన అమెరికా తీయారీ F-16 విమానాల నిర్వహణకు బాధ్యత వహించే మిరాజ్ రీబిల్డ్ ఫ్యాక్టరీ(ఎంఆర్ఎఫ్), పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ లాజిస్టిక్స్‌ను రాబోయే సంక్షోభం గురించి హెచ్చరించింది. US ఫారిన్ మిలిటరీ సేల్స్ (FMS) ప్రోగ్రామ్‌కు 6.82 లక్షల డాలర్ల చెల్లింపు గడువు ముగిసినట్లు ఎంఆర్ఎఫ్ ఒక లేఖలో పేర్కొంది. ఎంఆర్ఎఫ్ అనేది F-16ల కార్యాచరణ సంసిద్ధత, వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది.
Read Also: Amit Shah: కేరళ విలయంపై రాజ్యసభలో అమిత్ షా కీలక ప్రకటన
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్, ఇప్పటికే అమెరికా విడిభాగాల డెలివరీని నిలిపేసింది. దీంతో ఈ విమానాల సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా భారత్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ భారత్‌పై దాడి చేసేందుకు F-16 విమానాలను వినియోగించింది. ఈ సమయంలో రష్యన్ తయారీ పాత కాలం నాటి మిగ్-21 ద్వారా ఒక పాక్ F-16ని నేలకూల్చాం.
1980ల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ నుండి 40 F-16 ఫైటర్ జెట్‌లను పాకిస్తాన్ కొనుగోలు చేసింది. 9/11 దాడుల తరువాత, పాకిస్తాన్ అదనపు అధునాతన F-16లను కోరింది. కఠినమైన షరతులలో అమెరికా వాటిని అందించడానికి అంగీకరించింది. విమానం యొక్క నిర్వహణ మరియు భద్రతను పర్యవేక్షించడానికి ఒక అమెరికన్ సాంకేతిక భద్రతా బృందాన్ని నియమించడం ఇందులో ఒక షరతు. ఇవి దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటు చైనా వంటి దేశాలతో దీని వివరాలను పంచుకోవడంపై అమెరికా నియంత్రణ ఉంటుంది.
ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాకిస్తాన్‌కి మిలిటరీ సాయాన్ని అమెరికా నిలిపేసింది. 2022లో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా F-16 విమానాలను అప్‌గ్రేడ్ చేయడానికి పాకిస్తాన్‌కు 450 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది, ఈ చర్యను భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. అంతకుముందు ట్రంప్ పాకిస్తాన్ హక్కానీ, తాలిబాన్ నెట్వర్క్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సాయాన్ని నిలిపేశాడు. ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక సంక్షోభం F-16ని నేలపై ఉండేలా చేసింది. మరోవైపు అమెరికా తన అధునాతనమైన F-21, ఐదవ తరం F-35 వంటి అధునాతన యుద్ధ విమానాలను అందించినప్పటికీ, పాక్ ఇంకా పాతకాలపు F-16 ఫ్లీట్‌పై ఆధారపడుతోంది.