Best Mileage Bikes: భారతదేశంలో పెట్రోల్ ధరలు కాస్త ఎక్కవుగా నేపథ్యంలో.. మంచి మైలేజీ ఇచ్చే బడ్జెట్ బైక్‌ల కోసం డిమాండ్ భారీగా పెరిగింది. తక్కువ ధరలో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం కలిగిన బైక్‌లు సాధారణ వినియోగదారులకు ఎంతగానో మేలు చేకూరిస్తాయి. మరి ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్ లో అత్యధిక మైలేజీతో తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే టాప్ 5 బడ్జెట్ బైక్‌ల లిస్ట్ చూసేద్దాం.
హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus):
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో స్ప్లెండర్ ప్లస్ మొదటిస్థానంలో ఉంటుంది. నమ్మదగిన ఇంజిన్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, మంచి మైలేజీ ఈ మూడు కారణాలు దీన్ని ప్రజాదరణ పొందేలా చేశాయి. ఇందులో 97.2cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో ఇది రోజువారీ ప్రయాణాలకు అత్యంత సరైన భాగస్వామి. ఇందులో ఉన్న హీరో i3S Idle-Start-Stop టెక్నాలజీ ట్రాఫిక్‌లో బైక్‌ను ఆటోమేటిక్‌గా ఆపి ఇంధనాన్ని ఆదా చేస్తుంది, దీంతో మైలేజీ మరింత మెరుగవుతుంది. 65 నుంచి 80 kmpl వరకు అంచనా మైలేజీ అందించే ఈ బైక్‌లో, IBS సేఫ్టీ ఫీచర్ మరియు కొన్ని వేరియంట్‌లలో అందించే USB Charging పోర్ట్ కూడా ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మారుస్తాయి. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, పొదుపు కోరుకునే వారికి స్ప్లెండర్ ప్లస్ ఒక అద్భుతమైన ఎంపిక.
బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100):
“మైలేజ్ కి బాప్” అని పేరు తెచ్చుకున్న ప్లాటినా అత్యుత్తమ మైలేజీని అందిస్తుంది. దీని ComforTec టెక్నాలజీ సిటీ రైడింగ్ కోసం అద్భుతంగా సరిపోతుంది. రోడ్డు గుంతలు, చిన్న షాకులు కూడా తక్కువగా అనిపించేటట్లుగా సస్పెన్షన్ ట్యూన్ చేయబడింది. 70 నుంచి 90 kmpl వరకు అద్భుతమైన మైలేజీ అందించే 102cc DTS-i ఇంజిన్ ప్లాటినా ప్రధాన బలం. ఈ ఇంజిన్ ఎక్కువ ఇంధన సామర్థ్యంతో పాటు స్మూత్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా ట్యూబ్‌లెస్ టైర్లు, పగటిపూట కూడా స్పష్టంగా కనిపించే LED DRL లైట్లు వంటి ఫీచర్లు ప్రాక్టికల్ యూజ్‌లో మంచి ప్రయోజనం అందిస్తాయి.
టీవీఎస్ రేడియన్ (TVS Radeon):
టీవీఎస్ రేడియన్ (TVS Radeon) మంచి మైలేజీతో పాటు బలమైన బాడీ క్వాలిటీ కోరుకునే రైడర్లకు సరైన ఎంపికగా నిలుస్తుంది. దీని రాబస్ట్ డిజైన్ కారణంగా ఇది పనివాళ్లు, డెలివరీ రైడర్లు ప్రత్యేకంగా ఇష్టపడే బైక్‌గా మారింది. రేడియన్‌లో ఉన్న 109.7cc DuraLife ఇంజిన్ మెరుగైన ఇంధన పనితీరు, దీర్ఘకాలికతను అందించేందుకు రూపొందించబడింది. అందువల్ల ఇది రోజువారీ ప్రయాణాలకు అత్యంత అనుకూలమైనది. మైలేజ్ పరంగా ఈ బైక్ 60–70 kmpl వరకు అందించగలదని అంచనా. అంతేకాకుండా ట్యాంక్ ప్యాడ్స్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) వంటి భద్రతా, సౌకర్య ఫీచర్లు రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
హోండా షైన్ 100 (Honda Shine 100):
హోండా షైన్ 100 (Honda Shine 100) సిటీ రైడింగ్‌కి అత్యంత అనువైన, తేలికగా నడిపే బైక్‌లలో ఒకటి. హోండా బ్రాండ్ విశ్వసనీయతతో పాటు.. ఈ మోడల్ రోజువారీ ప్రయాణాలకు సరిపోయే స్థిరమైన పనితీరును అందిస్తుంది. ఇంజిన్ చాలా స్మూత్‌గా పని చేయడం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఉండటం షైన్ 100 ను బడ్జెట్ రేంజ్‌లో మంచి ఎంపికగా నిలబెడతాయి. ఈ బైక్ 65–75 kmpl మధ్య అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. షైన్ 100లో ఇచ్చిన 98.98cc PGM-FI ఇంజిన్ మెరుగైన ఫ్యూయల్ ఎఫిషెన్సీని కలిగిస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ కారణంగా బైక్ రెస్పాన్స్, స్టార్టింగ్, ఇంధన వినియోగం మరింత మెరుగై ఉంటుంది. ACG సైలెంట్ స్టార్టర్ బైక్ స్టార్ట్ చేసే సమయంలో వచ్చే శబ్దాన్ని తగ్గించి స్మూత్ అనుభూతిని ఇస్తుంది. వీటితోపాటు ఇందులో ఉండే సైడ్ స్టాండ్ కట్-ఆఫ్ ఫీచర్ సేఫ్టీ పరంగా బాగా పనిచేస్తుంది.
Rohit Sharma Historic Milestone: 41 పరుగులే.. దిగ్గజాలు సచిన్, ద్రవిడ్ సరసన రోహిత్ శర్మ!
హీరో HF డీలక్స్ (Hero HF Deluxe):
హీరో HF డీలక్స్ (Hero HF Deluxe) తక్కువ బడ్జెట్‌లో అత్యధిక మైలేజీ కోరే రైడర్లకు పర్ఫెక్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. స్ప్లెండర్‌లో వాడిన 97.2cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఇందులో కూడా అందుబాటులో ఉండటం వల్ల దీని పనితీరు నమ్మదగినదిగా ఉంటుంది. రోజువారీ ప్రయాణాల్లో ఇంధనం పొదుపు చేయాలనుకునే వారికి ఇది మంచిగా పనిచేస్తుంది. i3S టెక్నాలజీ (కొన్ని వేరియంట్‌లలో) ఉండటం వల్ల ట్రాఫిక్ సిట్యువేషన్లలో బైక్ ఆటోమేటిక్‌గా ఆగి మైలేజీని మరింత మెరుగుపరుస్తుంది. దృఢమైన ఫ్రేమ్, కొద్దిగా స్పోర్టీగా కనిపించే డిజైన్ దీన్ని సాధారణ బడ్జెట్ బైక్‌ల కంటే ఆకర్షణీయంగా మారుస్తాయి.