Pakistan: ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న బిలావల్ భుట్టో.. తీవ్ర దుమారం..!
- పాకిస్థాన్ లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది..
- పాక్ ఎన్నికల్లో పారదర్శకత కొరవడింది: పీపీపీ చీఫ్..
- నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి: భుట్టో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ గురించి స్పందించారు. క్వెట్టాలో విలేకరుల సమావేశంలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పారదర్శకత కొరవడింది.. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికలు పాకిస్తాన్ చరిత్రలో అతి పెద్ద రిగ్గింగ్ జరిగిందని పేర్కొన్నారు. రాజకీయ ఏకాభిప్రాయం ద్వారా ఎన్నికల్లో రిగ్గింగ్ పునరావృతమయ్యే సమస్యను ముగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కోరుకోవాలని బిలావల్ భుట్టో సూచించారు.
Read Also: Kalki 2898 AD: రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డు… కల్కి కలెక్షన్స్ ఎంతంటే ..?
Also Read
ఇక, ఎన్నికల సంస్కరణలను సమర్థించడంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పాత్రను కూడా బిలావల్ భుట్టో జర్దారీ గుర్తించారు. ప్రత్యర్థి పార్టీలు లేదా వ్యక్తిగత రాజకీయ నాయకుల నుంచి అప్పుడప్పుడు అడ్డంకులు ఎదురవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల ట్రిబ్యునల్స్‌లో కొనసాగుతున్న ఎలక్షన్ మోసాల కేసులను ఎత్తి చూపుతూ.. న్యాయమైన ఎన్నికల పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. ఆరోగ్య సంరక్షణలో సింధ్ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా బిలావల్ ప్రశంసించారు.
Read Also: AR Rahman : వారి వల్ల ఉద్వేగానికి లోనయ్యాను.. ఏఆర్ రెహమాన్..
అయితే, క్వెట్టాలో కూడా మెరుగైన వైద్యం, సమాన విద్యను అక్కడి నివాసితులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇదే విధమైన జరుగుతుందని పీపీపీ చీఫ్ బిలావల్ భుట్టో అన్నారు. ఇక, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ యొక్క మేనిఫెస్టోను గుర్తు చేస్తూ.. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) రద్దుపై పార్టీ వైఖరిని పునరుద్ఘాటించారు.. న్యాబ్ పొలిటికల్ ఇంజినీరింగ్, ప్రతీకార వ్యూహాలు, రాజకీయ నాయకుల ప్రతిష్టను దిగజార్చిందని ఆయన విమర్శించారు. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్య ప్రక్రియలను ప్రతికూలంగా ప్రభావితం చేసిందని బిలావల్ భుట్టో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?