బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పారదర్శకత కొరవడింది.. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికలు పాకిస్తాన్ చరిత్రలో అతి పెద్ద రిగ్గింగ్ జరిగిందని పేర్కొన్నారు.
PML-N alliance talks with PPP in Pakistan Elections 2024: పాకిస్థాన్ ప్రజలు ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో.. అక్కడ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ, మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అండతో పీఎంఎల్-ఎన్…
పాకిస్థాన్‌లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, ఇమ్రాన్‌ఖాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అవినీతి కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం.. పీటీఐ పార్టీ బ్యాట్ గుర్తుపై ఈసీ నిషేధం విధించడంతో షరీఫ్‌కు చెందిన పీఎంఎల్ (ఎన్).. ఈ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది.
ఇమ్రాన్‌ఖాన్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత శక్తివంతమైన ఆల్‌రౌండర్లలో ఒకడు. బ్యాట్, బంతితో ఎప్పుడైనా ఆట గమనాన్ని మార్చగల సత్తా అతనికి ఉంది. రిటైర్మెంట్ తర్వాత బంతికి దూరమైన ఆయన నుంచి బ్యాట్‌ను బలవంతంగా లాక్కుంది ఎన్నికల సంఘం.
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలకు గురువారం ఓటింగ్ జరగనుండగా, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సైన్యం మద్దతు ఉందని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బుధవారం కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఎన్నికల కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్న జంట బాంబు పేలుళ్లలో కనీసం 30 మంది మరణించారు.