A Man Killed His Lover For Marrying With Another Guy: హైదరాబాద్‌లోని బాలానగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తనని కాదని మరో వ్యక్తితో పెళ్లి చేసుకుందని.. ప్రియురాలి గొంతు కోశాడు ప్రియుడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మిర్యాగూడకు చెందిన హరికృష్ణ, పండుల శారద కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలానగర్‌లో గత ఏడు నెలల నుంచి సహజీవనం సాగిస్తున్నారు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. రవి అనే మరో వ్యక్తిని శారద వివాహమాడింది. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ కోపంతో రగిలిపోయాడు. తనని మోసం చేసిందని శారదపై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
Akkineni Nagarjuna: ఏమయ్యా నాగార్జున.. తండ్రి వివాదం కన్నా పెళ్లి వేడుక ముఖ్యమా..?
ప్లాన్ ప్రకారం.. బాలానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని అంబికా కాలనీలో ఈరోజు (26-01-23) ఉదయం శారదని హరికృష్ణ అడ్డగించాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో శారద అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు వెంటనే సమాచారం అందించగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న హరికృష్ణ కోసం గాలిస్తున్నారు. శారద మృతికి ట్రయాంగిల్ స్టోరీనే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉదయమే ఈ దారుణం జరగడంతో.. చుట్టుపక్కల వారు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు.
Janata Dal United: రావడం కుదరదు.. కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన జేడీయూ