Pakistan: ;పాక్ సైన్యంపై తాలిబన్ల మెరుపుదాడి.. 16 మంది మృతి..
- పాకిస్తాన్ ఆర్మీపై తాలిబన్ల మెరుపు దాడి..
- 16 మంది పాక్ సైనికుల మృతి..
- ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ సైన్యంపై పాక్ తాలిబన్లు ఘోరమైన దాడి చేశారు. మొత్తం 16 మంది పాక్ సైనికులను హతమార్చారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్‌పోస్టుపై తాలిబన్లు రాత్రిపూట మెరుపు దాడి చేశారు. మొత్తం 30 మంది ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఆర్మీ ఔట్ పోస్టు మూడు వైపుల నుంచి రెండు గంటల పాటు దాడి చేశారని పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. దాడి అనంతరం చెక్ పాయింట్ వద్ద ఉన్న వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరికరాలను, పత్రాలను, ఇతర వస్తువులను తాలిబన్లు తగలబెట్టారు.
Read Also: Sridhar Babu: అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్..
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
ఆఫ్ఘన్ సరిహద్దుకు 40 కి.మీ దూరంలో ఉన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని మాకీన్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. తమ సీనియర్ కమాండర్ల బలిదాలనుకు ప్రతీకారంగా ఈ దాడి జరిపినట్లు తాలిబన్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్ తాలిబన్లు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాక్ ఆర్మీ, పోలీసులు లక్ష్యంగా దాడులు జరుపుతున్నారు.
ఇస్లామాబాద్‌లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ప్రకారం, గత ఏడాది మరణాలు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి, 1,500 మందికి పైగా పౌరులు, భద్రతా దళాలు,ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదుల్ని నిలువరించడంలో ఆఫ్ఘన్ పాలకులు విఫలమయ్యారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!