నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ బుధవారం పాకిస్థాన్‌లోని తన సొంత గడ్డపై అడుగుపెట్టింది. 13 ఏళ్ల తర్వాత ఆమె తన స్వస్థలానికి తిరిగి వచ్చింది. ఆమె తండ్రి, భర్త, సోదరుడు హై సెక్యూరిటీ మధ్య పాక్‌కు చేరుకుంది. 15 ఏళ్ల వయసులో ఆమెపై తాలిబన్లు కాల్పులకు తెగబడ్డారు. స్వాత్ లోయలో ఉగ్రవాదులు బస్సు ఎక్కి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలయ్యాయి.
Pakistan: పాకిస్తాన్ సైన్యంపై పాక్ తాలిబన్లు ఘోరమైన దాడి చేశారు. మొత్తం 16 మంది పాక్ సైనికులను హతమార్చారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్‌పోస్టుపై తాలిబన్లు రాత్రిపూట మెరుపు దాడి చేశారు. మొత్తం 30 మంది ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఆర్మీ ఔట్ పోస్టు మూడు వైపుల నుంచి రెండు గంటల పాటు దాడి చేశారని పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.
పాకిస్తానీ తాలిబన్‌కు చెందిన భారీ సాయుధ ఉగ్రవాదుల బృందం శనివారం పెషావర్ నగర శివారులోని ఒక పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడింది. ఈ దాడిలో సీనియర్ పోలీసు అధికారితో సహా ముగ్గురు పోలీసులను చంపినట్లు అధికారులు తెలిపారు.
వారాంతంలో పాకిస్తాన్ పోలీసు స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్న 33 మంది అనుమానిత ఉగ్రవాద ఖైదీలు మంగళవారం ప్రత్యేక దళాల క్లియరెన్స్ ఆపరేషన్‌లో మరణించారని, వారి బందీలను విడిపించారని రక్షణ మంత్రి తెలిపారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)తో సహా వివిధ తీవ్రవాద గ్రూపులకు చెందిన వారిగా అనుమానించబడిన ఉగ్రవాద ఖైదీలు ఆదివారం నాడు వారి జైలర్లను అధిగమించి ఆయుధాలను లాక్కున్నారు