PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
- పాకిస్తాన్లో పెట్రోల్ ధరల మంటలు..
- పెట్రోల్, నిత్యవసరాల ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం..
- జమాతే ఇస్లామీ నేతృత్వంలో ప్రధాన నగరాల్లో నిరసనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAKISTAN: అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసి అంతర్జాతీయంగా తనను తాను సూపర్ పవర్‌గా భావించుకుంటోంది పాకిస్తాన్. కానీ దేశంలో మాత్రం ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదే కాకుండా బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ల్లో తిరుగుబాటు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రజాగ్రహం తీవ్ర స్థాయికి చేరుతోంది. పెట్రోలియం లెవీ, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ జమాత్-ఇ-ఇస్లామీ ఆందోళనకు పిలుపునివ్వడంతో వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల పైకి వచ్చారు.
కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్, రావల్పిండి, అబోట్టాబాద్ వంటి నగరాల్లో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన రహదారులతో పాటు, హైవేలపై ఆందోళనలు చేవారు. లెవీని వెనక్కి తీసుకోవాలి, ఎలాంటి లెవీ లేకుండా రూ. 225కే ఇంధనం ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. జమాత్-ఇ-ఇస్లామీ అధినేత హఫీజ్ నయీముర్ రెహ్మాన్ ప్రభుత్వ పన్ను విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం పెట్రోలియం పై లెవీ ద్వారా రూ. 8 ట్రిలియన్ల పాకిస్తానీ రూపాయలను వసూలు చేసిందని ఆరోపించారు. మరోవైపు, ఐఎంఎఫ్ లెవీని తగ్గించేందుకు అంగీకరించిందని ప్రభుత్వం చెబుతోంది.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
శుక్రవారం జరిగిన నిరసనలు కేవలం ట్రైలర్ మాత్రమే అని జమాతే ఇస్లామీ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైనే ఈ నిరసనల్ని దీర్ఘకాలం కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రెహ్మాన్ తెలిపారు. ఇరాన్ యుద్ధం, ఆర్థిక సంక్షోభం కారణంగా ఏప్రిల్‌లో లీటర్ పెట్రోల్ రూ. 459 పాకిస్తానీ రూపాయలకు చేరింది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ. 157.26. డీజిల్ ధర రూ. 520.35 పాక్ రూపాలయకు చేరింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్ యుద్ధం తర్వాత ఇంధన ధరలు అత్యధికంగా పెరిగిన దేశాల్లో పాక్ రెండోస్థానంలో ఉంది.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?