Pakistan: మరింత పేదరికంలోకి పాకిస్థాన్.. వెలుగులోకి సర్వే
- మరింత పేదరికంలోకి పాకిస్థాన్
- వెలుగులోకి షాకింగ్ సర్వే
- అభివృద్ధిలోకి దూసుకెళ్తోన్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాసియాలో అన్ని దేశాలు అభివృద్ధిలోకి పరుగులు పెడుతుంటే పాకిస్థాన్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గతంలో కంటే ప్రస్తుతం మరింత పేదరికంలోకి వెళ్తోందని తాజా గణాంకాలను బట్టి అర్థమవుతోంది. పాకిస్థాన్‌లో పేదరికం 6 సంవత్సరాల్లో 7 శాతం పెరిగినట్లుగా తాజా సర్వేలను బట్టి వెల్లడవుతోంది.
అభివృద్ధిపై కాకుండా యుద్ధం కోసం విధానాలు రూపొందించే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. రక్షణ కోసం ఖర్చు చేసే వ్యయమంతా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుంది. 2024-25లో 28.8 శాతం పాకిస్థానీయులు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నట్లుగా వెల్లడైంది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణంగా తేలింది.
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
ఇది కూడా చదవండి: Trump: ‘‘న్యాయమూర్తులు మూర్ఖులు.. లాప్‌డాగ్‌లు’’.. టారిఫ్‌లు రద్దు చేయడంపై ట్రంప్ ఆగ్రహం
పాకిస్థాన్ ప్రభుత్వం లెక్కల ప్రకారం.. 2018-19లో పేదరికం రేటు 21.9 శాతం ఉండగా.. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత 6.9 శాతం పెరిగి 28.8 శాతానికి చేరింది. ఈ ఫలితాలు 2024-25లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఉన్నాయి. పాకిస్థాన్‌లోని అన్ని ప్రావిన్సుల్లో.. ముఖ్యంగా పంజాబ్, సింధ్‌లలో పేదరికం పెరిగినట్లుగా పేర్కొంది.
గురువారం పాకిస్థాన్ వెబ్‌సైట్ ది న్యూస్‌తో ఉన్నత అధికారిక వర్గాలు మాట్లాడుతూ.. ‘‘గత ఆరు సంవత్సరాల్లో మూడు IMF స్థిరీకరణ కార్యక్రమాలు, కోవిడ్-19 ప్రభావం, కమోడిటీ సూపర్-సైకిల్, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ GDP వృద్ధి రేటు, రెండు సూపర్ వరదలు, గోధుమ మద్దతు ధరను వదిలివేయడం వంటి అనేక కారణాల వల్ల పాకిస్థాన్‌లో పేదరికం స్థాయి పెరిగింది.’’ అని అన్నారు.
ఇదిలా ఉంటే గత 6 సంవత్సరాల్లో భారతదేశంలో పేదరికం తగ్గింది. పేదరిక నిర్మూలనలో భారతదేశం విశేషమైన కృషి చేసింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం 10 సంవత్సరాలలో 171 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. ఇక అన్ని రంగాల్లో భారత్ ముందుకు దూసుకుపోతుంది. వికసిత్ భారత్‌లో భాగంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగడంతో పేదరికం తగ్గింది.
ఇది కూడా చదవండి: Off The Record : కవితను లైట్ తీసుకోవడమే బెటరని బీఆర్ఎస్ నేతలు డిసైడయ్యారా?
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..