Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pakistan Positions Itself As Leader Of Muslim World Asim Munirs Arms Push Raises Alarm

Pakistan: ముస్లిం దేశాలకు “పెద్దన్న” కావాలని పాకిస్తాన్ ఆరాటం..

Published Date :January 12, 2026 , 5:34 pm
By Venu Goapl Reddy
  • ముస్లిం దేశాలకు పెద్దన్న కావాలని పాకిస్తాన్ ప్లాన్..
  • పలు దేశాలతో సైనిక ఒప్పందాలకు ఆరాటం..
Pakistan: ముస్లిం దేశాలకు “పెద్దన్న” కావాలని పాకిస్తాన్ ఆరాటం..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Pakistan: పాకిస్తాన్ సైన్యానికి చీఫ్‌గా మారిన తర్వాత అసిమ్ మునీర్ ప్రవేశపెట్టిన ‘‘డిఫెన్స్ డాక్ట్రిన్’’(రక్షణ సిద్ధాంతం) కీలక లక్ష్యాలను వెల్లడిస్తోంది. ముస్లిం దేశాలకు ‘‘పెద్దన్న’’గా వ్యవహరించాలని పాక్ తహతహలాడుతోంది. ఆయుధాల ఎగుమతి, వ్యూహాత్మక సంబంధాలు, ఒప్పందాలు, సైనిక శిక్షణా కార్యక్రమాల ద్వారా ముస్లిం దేశాలకు తానే సంరక్షకుడిని అనే భావన కలిగించాలని పాక్ ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ప్రాంతీయ బెదిరింపులు, అస్థిరత ఎదుర్కొంటున్న ముస్లిం దేశాలకు అణ్వాయుధ రక్షణను అందించాలని పాకిస్తాన్ భావిస్తోంది. ముస్లిం ప్రపంచంలో పాకిస్తాన్ వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. ఇజ్రాయిల్, ఇతర దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మిత్రదేశాలకు వ్యూహాత్మక హామీలను అందించాలని పాక్ భావిస్తోంది. తద్వారా ఆయా దేశాల్లో తన పరపతి పెంచుకోవాలని చూస్తోంది.

Also Read

  • Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్‌ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్
  • Ittehad-ul-Mujahideen: పాక్‌ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
  • Internet Crisis: ఇంటర్నెట్‌కు హోర్ముజ్ సెగలు.. భారత్‌కు ముప్పు తప్పదా?
Add as a preferred
source on google

Read Also: Anchor Shyamala: రెడ్‌ బుక్‌పై యాంకర్‌ శ్యామల హాట్‌ కామెంట్స్‌.. కోడి కోసినా.. కేక్‌ కట్ చేసినా కేసులే..!

ఇప్పటికే సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య వ్యూహాత్మక సైనిక ఒప్పందం జరిగింది. ఇందులో పాక్-చైనాలు సంయుక్తంగా తయారు చేస్తున్న JF-17 థండర్ యుద్ధ విమానాల ఒప్పందం ఒక్కటే సుమారు 3.7 బిలియన్ డాలర్ల విలువ ఉండొచ్చని అంచనా. ఇటీవల, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. దాదాపు 8 ముస్లిం దేశాలు పాకిస్తాన్‌తో రక్షణ భాగస్వామ్యాలపై ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. పాక్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఎగుమతుల ఆర్డర్లను పొందింది. రాబోయే మూడు నుంచి 5 ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల ఆయుధ అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది.

అజర్‌బైజాన్‌కు 40 JF-17 ఫైటర్ జెట్‌ల కోసం $4.6 బిలియన్ల ఒప్పందం కుదుర్చుకుంది. లిబియా, సూడాన్, బంగ్లాదేశ్‌లకు పెద్ద ఎత్తున ఆయుధాలను అమ్మే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జోర్డాన్, ఈజిప్టులు కూడా పాకిస్తాన్ రక్షణ పరికరాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ఒప్పందాల తర్వాత పాకిస్తాన్ ముస్లిం దేశాలలో నాటో లాంటి సైనిక కూటమిని నిర్మించడానికి ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asim Munir
  • India Security Concerns
  • JF-17 Thunder
  • Muslim world leadership
  • nuclear umbrella

తాజావార్తలు

  • AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్‌ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..

  • Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!

  • High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు

  • Cannes 2026: కేన్స్ ఫెస్టివల్‌లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

  • Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!

ట్రెండింగ్‌

  • Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions