Pakistan: పాకిస్తాన్ సైన్యానికి చీఫ్‌గా మారిన తర్వాత అసిమ్ మునీర్ ప్రవేశపెట్టిన ‘‘డిఫెన్స్ డాక్ట్రిన్’’(రక్షణ సిద్ధాంతం) కీలక లక్ష్యాలను వెల్లడిస్తోంది. ముస్లిం దేశాలకు ‘‘పెద్దన్న’’గా వ్యవహరించాలని పాక్ తహతహలాడుతోంది. ఆయుధాల ఎగుమతి, వ్యూహాత్మక సంబంధాలు, ఒప్పందాలు, సైనిక శిక్షణా కార్యక్రమాల ద్వారా ముస్లిం దేశాలకు తానే సంరక్షకుడిని అనే భావన కలిగించాలని పాక్ ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. ప్రాంతీయ బెదిరింపులు, అస్థిరత ఎదుర్కొంటున్న ముస్లిం దేశాలకు అణ్వాయుధ రక్షణను అందించాలని పాకిస్తాన్ భావిస్తోంది. ముస్లిం…
Pakistan-Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వచ్చిన మహ్మద్ యూనస్ పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. రెండు దేశాలు భారత్ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయి. తాజాగా, బంగ్లా-పాక్‌లు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దౌత్య, అధికారిక పాస్‌పోర్టులు కలిగిన వ్యక్తుల వీసా రహిత ప్రవేశానికి అంగీకరించాయి.
Bangladesh: భారత్‌కు పాకిస్తాన్ మాత్రమే కాకుండా, బంగ్లాదేశ్ కూడా పక్కలో బళ్లెంతా తయారవుతోంది. షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయివచ్చిన తర్వాత, అక్కడ భారత వ్యతిరేకత బాగా పెరిగింది. తాత్కిలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సర్కార్ స్పష్టంగా భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. పలు సందర్భాల్లో భారత్‌ని ఇరుకున పెట్టేలా యూనస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ , చైనాలతో దోస్తీ మన దేశానికి ఇబ్బందికరంగా మారింది.